మన ఈనాడు: తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం గృహజ్యోతి పథకం అమలు చేసేందుకు సిద్దం అయింది. దీంట్లో భాగంగా 200యూనిట్లు లోపు కరెంటు వినియోగించేవారికి ఉచిత విద్యుత్తు సరాఫరా చేయబోతున్నట్లు అధికారికంగా సీఎం రేవంత్రెడ్డి ఇప్పటికే ప్రకటించారు.
ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీ పథకాలు పక్కగా లబ్దిదారులకు చేరాలంటే ప్రభుత్వ గుర్తింపు పొందిన కార్డులు లింక్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.రేషన్ కార్డు, ఉపాధిహమీ కార్డు,డ్రైవింగ్ లైసన్స్, బ్యాంకుపాస్ బుక్, ఓటరు కార్డు లేదా స్థానిక ఎంఆర్వో నుంచి గుర్తింపు పత్రం అందజేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.
నేటి నుంచి విద్యుత్తుశాఖ అందించే ఉచిత కరెంటు పథకం లబ్దిదారుల ఎంపిక కావాలంటే మీటర్ సర్వీస్ నెంబరుకు ఆధార్ కార్డు తప్పనిసరి సర్కూలర్ జారీ చేసింది. విద్యుత్తు మీటరు ఎవరి పేరు మీద ఉంటే వారిదే ఆధార్ కార్డు అనుసంధానం చేస్తేనే ఉచితం విద్యుత్తు పథకానికి అర్హులగా గుర్తిస్తున్నట్లు తెలిపింది.
ఆధార్ కార్డులో రిజస్టర్ కాబడిన మొబైల్ నెంబరుకు వచ్చే ఓటిపి లేదా బయోమెట్రిక్ ద్వారా విద్యుత్తుశాఖ వినియోగదారులు మీటర్లుకు ఆధార్ అనుసంధానం చేసే ప్రక్రీయ త్వరలోనే ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ చెప్పింది. ఆధార్ కార్డు లేని వారు ఎవరైనా ఉంటే ఎన్రోల్మెంట్ నెంబరు నమోదు చేయించి శాశ్వత నెంబరు వచ్చాక అనుసంధానం చేస్తామని సెల్ప్డిక్లేరేషన్ ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు.