
మహానగరం హైదరాబాద్(Hyderabad) మరో ప్రతిష్ఠాత్మక వేడుకకు సిద్ధమవుతోంది. మిస్ వరల్డ్-72 పోటీల(Miss World-72 Competition) ఆతిథ్యానికి వేదిక కానుంది. మే 7వ తేదీ నుంచి 31 వరకు ఈ పోటీలను నిర్వహించనున్నట్లు మిస్ వరల్డ్ లిమిటెడ్ ఛైర్మన్, CEO జూలియా మోర్లీ, తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్(Smita Sabharwal) ప్రకటించారు. విభిన్నమైన కళా వారసత్వం ఉన్న తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీల(Miss World contests in Telangana)ను స్వాగతిస్తున్నామని వీరు తెలిపారు. కాగా ఈ మిస్ వరల్డ్ పోటీల్లో 120 దేశాల నుంచి యువతులు పాల్గొంటారని వారు తెలిపారు.
గతంలో ముంబై, న్యూఢిల్లీల్లో పోటీలు
‘Beauty With A Person’ అనే థీమ్‌తో ఈ మిస్ వరల్డ్ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మే 7న ప్రారంభ వేడుకలు ఉంటాయని అలాగే 31వ తేదీన ముగింపు సెలబ్రేషన్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు. గతంలో ముంబై, న్యూఢిల్లీల్లో మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి. కాగా ‘‘ఈ మిస్ వరల్డ్ పోటీలు 120 దేశాల నుంచి పాల్గొనే వారిని ఒకచోట చేర్చుతుందని, ప్రతిష్ఠాత్మకమైన టైటిల్ కోసం మాత్రమే కాకుండా, మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ‘బ్యూటీ విత్ ఎ పర్పస్’ అనే లక్ష్యంతో పోటీ పడుతుంది’’ అని మిస్ వరల్డ్ లిమిటెడ్ పేర్కొంది. పలు దేశాల ప్రతినిధులు మే 7వ తేదీన తెలంగాణకు వస్తారని తెలిపింది. చెక్ రిపబ్లిక్ నుంచి ప్రస్తుత మిస్ వరల్డ్ క్రిస్టినా పిజ్జ్కోవా(Kristina Pizzkova) తదుపరి ఎంపికయ్యే ప్రపంచ సుందరికీ కీరిటం అందిస్తారని వెల్లడించింది.