మన ఈనాడు: సంక్రాంతి పండుగ పురస్కరించుకుని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గుడ్ న్యూస్ చెప్పారు. సంక్రాంతి పండుగ రోజులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉంచబోతున్నట్లు ప్రకటించారు. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు స్పష్టం చేశారు.
సంక్రాంతికి సొంత ఊర్లోకి వెళ్తున్న మహిళలకు ఉచిత బసు ప్రయాణం పథకం అందుబాటులో ఉంటుందని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.మహిళలలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్స్ ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం చేయొచ్చని మరోసారి తెలిపారు.
ఇది కేవలం తెలంగాణ మహిళలకు మాత్రమే వర్తిస్తుందని అన్నారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక బస్సులు నడుపుతామని అన్నారు. ఆంధ్రకు వెళ్లే తెలంగాణ బస్సుల్లో కేవలం తెలంగాణ సరిహద్దు వరకే ఈ ఫ్రీ టికెట్ ఉండవచ్చని తెలుస్తోంది. అయితే గత కొన్ని రోజులుగా సంక్రాంతికి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని టీఎస్ ఆర్టీసి రద్దు చేసినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దీనిపై క్లారిటీ ఇచ్చారు.