తెలంగాణ సర్కారు గుడ్​ న్యూస్​..మీసేవలో కొత్త రేషన్‌కార్డులకు దరఖాస్తులు

మన ఈనాడు: తెలంగాణ ప్రభుత్వం గుడ్​ న్యూస్​ చెప్పారు. ఫిబ్రవరి నెలాఖరులోగా కొత్త రేషన్​ కార్డులు మీ సేవలో దరఖాస్తు చేసుకునేలా చర్యలు చేపడుతుంది. రేషన్ కార్డుల్లో పేరులేని వారు, మార్పులు చేర్పుల కోసం దరఖాస్తు చేసుకోనేలా ప్రణాళికలు సిద్దం చేసింది. రేషన్​ కార్డుల కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది ప్రభుత్వం.

రాష్ట్రంలోని నిరుపేద కు టుంబాల్లో అర్హత గల వారికి కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా అధికారికంగా మీ సేవా పోర్టల్ ద్వారా దరఖాస్తులను స్వీ కరించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సీ ఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉన్నతాధికారులను ఆదేశించారు. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుదారుల కోసం ఫిబ్రవరి నెలాఖరులోగా అప్లికేషన్స్ తీసుకోవాలని ప్రభు త్వం నిర్ణయించింది.ఇందులో భాగం గానే ప్రజా పాలనలో రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న వారు ఫిబ్రవరి చివరి వా రంలో మీ సేవా ద్వారా అప్లై చేయొచ్చు.అభయ హస్తం పేరుతో మొత్తం 5 గ్యారెంటీ లకు దాదా పు కోటి పది లక్షల అప్లికేషన్లు వచ్చాయి.

రేషన్ డీలర్లకు వద్దకు వెళ్లి ఆధార్ నంబర్ చెప్పి ,లబ్దిదారులకు చెందిన వేలి ముద్రలు నమోదు చేస్తే ఈ-కేవైసీ పూర్తవుతుందని వివరిస్తున్నారు. రేషన్ కార్డు ఈ-కేవైసీ చేసుకోకుంటే వారి పేరును రేషన్ కార్డు నుంచి తొలగిస్తామని స్పష్టం చేస్తున్నారు. జనవరి 31వ తేదీ లోగా రేషన్ కార్డు, ఆధార్ నంబర్‌కు లింక్ చేయాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ దేవేందర్ సింగ్ చౌహాన్ సూచించారు. కేంద్ర ప్రభుత్వం కూడా అర్హులైన పేదలకు ప్రధాన మంత్రి గరీ బ్ కల్యాణ్ అన్న యోజన స్కీమ్ ద్వారా రేష న్ బియ్యం, ఇతర సరకులు అందిస్తోంది. ఈ నేపధ్యంలోనే రేషన్‌కార్డు ఉన్న లబ్దిదారులు ఈకేవైసి ప్రక్రియను గడువులోగా పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Related Posts

Khammam|కార‌ణం తెలియ‌దు కానీ..ఖ‌మ్మం ఘ‌ట‌న దుర‌దృష్ట‌క‌రం

ఖ‌మ్మం ప‌త్తి మార్కెట్లో అగ్నిప్ర‌మాదం జ‌ర‌గ‌డానికి త‌న‌కి ఇంకా కార‌ణం తెలియ‌దు కానీ ఘ‌ట‌న జ‌ర‌గ‌డం దుర‌దృష్ట‌క‌రమ‌ని వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు అన్నారు. జిల్లా క‌లెక్ట‌ర్‌, పోలీస్ క‌మిష‌న‌ర్‌తో క‌లిసి గురువారం ఖ‌మ్మం ప‌త్తి మార్కెట్లో ప్ర‌మాదం జ‌రిగిన తీరును…

BIG BREAKING: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దుండగుల దాడి

బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్‌(Saif Ali Khan)పై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. ముంబై(Mumbai)లోని ఆయన నివాసంలోకి చొరబడిన దుండగులు ఇవాళ తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో ఆయనపై కత్తితో అటాక్(Knife Attack) చేశారు. ఈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *