మన ఈనాడు: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజల నుంచి తొలిరోజు వినతులను స్వీకరించారు. అధికారులు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను కొనసాగించారు. సోమవారం ఉదయం 10 గంటల లోపు ప్రజా భవన్‌కు చేరుకునే వారిని తమ దరఖాస్తులను సమర్పించేందుకు అనుమతించాలని అధికారులను సీఎం ఆదేశించారు. వికలాంగులు, మహిళలకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయాలని, ప్రజల సౌకర్యార్థం తాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పించాలని రేవంత్‌రెడ్డి అధికారులను కోరారు.
గత శుక్రవారం బేగంపేటలోని ప్రజాభవన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించిన ప్రజాదర్బార్‌కు రాష్ట్ర ప్రభుత్వం ప్రజావాణిగా నామకరణం చేసింది. ఇకపై వారంలో రెండుసార్లు నిర్వహించబడుతుంది. మంగళ, శుక్రవారాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది ప్రభుత్వం. ప్రజావాణిలో పౌరులు తమ సమస్యలపై దరఖాస్తులు సమర్పించవచ్చు.
తొలిరోజు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించగా, అధికారులు దరఖాస్తుల స్వీకరణను కొనసాగించారు. సోమవారం ఉదయం 10 గంటల లోపు ప్రజా భవన్‌కు చేరుకునే వారిని తమ దరఖాస్తులను సమర్పించేందుకు అనుమతించాలని అధికారులను సీఎం ఆదేశించారు. వికలాంగులు, మహిళలకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయాలని, ప్రజల సౌకర్యార్థం తాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పించాలని రేవంత్‌రెడ్డి అధికారులను కోరారు.