నెమలి సురేష్​ హయంలోనే మల్లాపూర్​ అభివృద్ధి

మన ఈనాడు: కాంగ్రెస్​ కార్పొరేటర్​గా నెమలి సురేష్​ హయంలోనే మల్లాపూర్​ అభివృద్ధి చెందిందని ఉప్పల్​ కాంగ్రెస్​ ఎమ్మెల్యే అభ్యర్థి మందముల పరమేశ్వరరెడ్డి అన్నారు. జనప్రియ అపార్ట్​మెంట్​, కేఎల్​రెడ్డినగర్​, మైప్లవర్​ పార్క్​ అపార్ట్​మెంట్​ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్​ పార్టీ ఇచ్చే ఆరు గ్యారంటీలతోనే తెలంగాణ సంక్షేమం సాధ్యం అవుతుందన్నారు.
ఉప్పల్ నియోజకవర్గంలో విద్య, వైద్యం, పేదల సంక్షేమం కోసం నిరంతరం అందుబాటులో ఉంటూ పనిచేస్తానని భరోసా ఇచ్చారు. మీతో కలసి అడుగులు వేస్తానని నవంబర్​ 30న జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి అభివృద్ధిని గెలపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు,కార్యకర్తలు,జనప్రియ టౌన్షిప్ అసోసియేషన్ సభ్యులు మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు

Related Posts

Chintakani: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు పట్టివేత

–నరేష్​ చిట్టూరి ManaEnadu:మున్నేరు నుంచి అక్రమంగా తరలిస్తున్న ఆరు ఇసుక ట్రాక్టర్లును రెవెన్యూ సిబ్బంది చింతకాని మండల తహశీల్దార్​ కార్యాలయానికి తరలించారు. డిప్యూటీ సీఎం ఇలాకాలో ప్రతిరోజు వందల సంఖ్యలో మున్నేటి గర్భంలో అక్రమంగా కొనసాగుతున్న ఇసుక తవ్వకాలపై అధికారులు కొరడా…

దసరా సెలవులు వచ్చేశాయ్.. ఇక పిల్లలకు పండగే

Mana Enadu : అప్పుడెప్పుడో సెప్టెంబరు నెల మొదటి వారంలో వర్షాలు (Rains) కురిసినప్పుడు స్కూళ్లు, కళాశాలలకు సెలవులు వచ్చాయి. ఆ తర్వాత ఒకరోజు వినాయక చవితికి, మరో రోజు గణేశ్ నిమజ్జనానికి (Ganesh Immersion) హాలిడేస్ ఇచ్చారు. ఇక అప్పటి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *