బీడీల చాట‌ల‌న్నీ కొప్పుల‌కే జై!

బీడీల చాట‌ల‌న్నీ కొప్పుల‌కే జై!
– బీడీల కార్మికుల మూకుమ్మ‌డి తీర్మాణాలు
– జీవ‌న భృతితో ఆదుకున్న కేసీఆర్ కే ఓటు
– మ‌రోసారి భృతి పెంపుపై ఆశ‌లు..
– జ‌గిత్యాల జిల్లాలో 89169 మంది ల‌బ్ధిదారులు

మ‌న ఈనాడు, హైద‌రాబాద్‌:

న‌డుములు వంగిపోయిన‌య్‌.. చేతుల‌కు పొక్కులొచ్చిన‌య్‌.. తంబాకు ఘాటుకు లేనిపోని రోగాలొచ్చిన‌య్‌.. అయినా ఆ బ‌తుకులెక్క‌డా త‌డ‌బ‌డ‌లేదు.. ఇంటిని నిల‌బెట్టేందుకు గంట‌ల త‌ర‌బ‌డి ఆ బీడీల చాట‌ల ముందే బ‌తుకులు నిలువునా కూలిపోతున్నా ఆ ప‌నిని వీడ‌లేదు. ఇన్నేళ్ల‌లో ఈ ఇండ్ల వైపు చూసిన నాథుడు లేడు. ఆ బీడీల చాట‌ల వెన‌కున్న బాధ‌ల‌ను ప‌ట్టించుకున్న పాపాన పోయినోళ్లెవ‌రూ లేరు. కానీ, ఓ నేత‌.. ఆ బ‌తుకుల‌కు ఆస‌రాగా నిలిచాడు. ప్ర‌తి ఇంటికీ పెద్ద కొడుకై, ఆడ‌బిడ్డ‌ల‌కు సొంత అన్నై నెల‌కు రూ.2016 ఆత్మ‌గౌర‌వ భృతిని అందించాడు. అత‌నే కేసీఆర్‌. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కూ ఏ నేతా చేయ‌ని సాహ‌సం చేసి, బీడీ కార్మికుల‌కు గౌర‌వ భృతిని అందిస్తున్న ఏకైక ముఖ్య‌మంత్రిగా నిలిచారు కేసీఆర్‌. అంతే కాదు ఆ భృతిని మ‌రోసారి పెంచేందుకూ యోచిస్తున్నారు. ఆ రుణ‌మే తీర్చుకుంటామంటున్నారు ధ‌ర్మ‌పురి నియోజ‌క‌వ‌ర్గ బీడీ కార్మికులు. మ‌రోసారి భారాస పార్టీ అభ్య‌ర్థిగా బ‌రిలో దిగిన మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ కు ఓటేసి త‌మ అభిమానాన్ని చాటుకుని ఆత్మ‌గౌర‌వాన్ని నిల‌బెట్టుకుంటామ‌ని తీర్మాణిస్తున్నారు.

ఎన్నో ఏళ్లుగా త‌మ‌కు అండాదండ‌గా ఉంటున్న కొప్పుల ఈశ్వ‌ర్‌కే త‌మ మ‌ద్ద‌తు తెల‌పాల‌ని ఇప్ప‌టికే చాలా గ్రామాల్లో బీడీ కార్మికులు తీర్మాణం చేశారు. బుగ్గారం, గొల్ల‌పెల్లి, ధ‌ర్మారం మండ‌లాల్లోని ప‌లు గ్రామాల్లో కంపెనీల్లోనే బీడీ కార్మికులు మూకుమ్మ‌డి తీర్మాణాలు చేయ‌గా.. మంత్రి కొప్పుల ప్ర‌చారానికి వ‌చ్చిన‌ప్పుడు త‌మ మ‌ద్ద‌తు తెలిపేందుకు ప‌లు గ్రామాల బీడీ కార్మికులు సిద్ధ‌మ‌వుతున్నారు.

* బీడీల కార్మికులంతా కొప్పుల వైపే..
జ‌గిత్యాల జిల్లా ప‌రిధిలో అత్య‌ధికంగా 89,169 మంది బీడీ కార్మికులు కేసీఆర్ స‌ర్కారు అందిస్తున్న జీవ‌న భృతిని పొందుతున్నారు. అందులో దాదాపు 40శాతం ధ‌ర్మ‌పురి నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని వారే కాగా… రాష్ట్రంలో అత్య‌ధికంగా ప్ర‌యోజ‌నం పొందుతున్న నియోజ‌క‌వ‌ర్గం సైతం ధ‌ర్మ‌పురే కావ‌డం విశేషం.

ఇళ్లు గ‌డ‌వ‌డానికి ఇరాం లేకుండా ప‌నిచేస్తున్న మ‌హిళ‌ల‌కు ఈ ఆస‌రా పెన్ష‌న్లు కొండంత భ‌రోసాగా నిలుస్తున్నాయి. ప్ర‌తినెలా ఒక‌టో తారీఖున టంఛ‌నుగా బ్యాంకు ఖాతాల్లో న‌గ‌దు జ‌మ కాగానే వారి మొఖాల్లో వెలిగే వెలుగులే కేసీఆర్ స‌ర్కారు మీదున్న అభిమానాన్ని చూపిస్తున్నాయి. అయితే ఈసారి సానుభూతి కోరుతూ ముందుకు వ‌స్తున్న కాంగ్రెస్ అభ్య‌ర్థి కంటే, ఎన్నో ఏళ్లుగా త‌మ‌కు అండాదండ‌గా ఉంటున్న కొప్పుల ఈశ్వ‌ర్‌కే త‌మ మ‌ద్ద‌తు తెల‌పాల‌ని ఇప్ప‌టికే చాలా గ్రామాల్లో బీడీ కార్మికులు తీర్మాణం చేశారు. బుగ్గారం, గొల్ల‌పెల్లి, ధ‌ర్మారం మండ‌లాల్లోని ప‌లు గ్రామాల్లో కంపెనీల్లోనే బీడీ కార్మికులు మూకుమ్మ‌డి తీర్మాణాలు చేయ‌గా.. మంత్రి కొప్పుల ప్ర‌చారానికి వ‌చ్చిన‌ప్పుడు త‌మ మ‌ద్ద‌తు తెలిపేందుకు ప‌లు గ్రామాల బీడీ కార్మికులు సిద్ధ‌మ‌వుతున్నారు.

 

 

Share post:

లేటెస్ట్