Mana Enadu: ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించి 50 మంది కార్మికులు మంటల్లో చిక్కుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా నందిగామ వద్ద చోటుచేసుకుంది.
నందిగామలోని ఆల్విన్ ఫార్మా కంపెనీలో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. ఘటన జరిగిన సమయంలో మొత్తం 50 మంది కార్మికులు విధుల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. అందులో కొంతమంది కిటికీలోంచి దూకి తమ ప్రాణాలు కాపాడుకున్నారు. ఇంకా చాలా మంది కార్మికులు పరిశ్రమ లోపల మంటల్లో చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. కార్మికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Vincy Aloshious: మాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ కలకలం.. నటి సంచలన ఆరోపణలు!
ఈ మధ్య మలయాళ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్(Casting Couch) వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. మహిళలపై లైంగిక వేధింపులపై హేమ కమిటీ(Hema Committee) ఇచ్చిన రిపోర్టుతో మలయాళ ఇండస్ట్రీ(Malayalam Industry) గురించి అంతా చర్చించుకుంటున్నారు. అప్పటి నుంచి నటీమణులు ఆరోపణలు కూడా ఎక్కువైపోయాయి.…