Mana Enadu: హీరో అర్జున్ సర్జా పెద్ద కూతురు ఐశ్వర్య, కోలీవుడ్ డైరెక్టర్ కమ్ కమెడియన్ తంబి రామయ్య కుమారుడు యంగ్ హీరో ఉమాపతిల వివాహం తాజాగా జరిగింది. చెన్నైలోని హనుమాన్ ఆలయంలో సంప్రదాయ పద్దతిలో వీరిద్దరి వివాహ వేడుక జరిగింది.
తాజాగా చెన్నై లీలా ప్యాలెస్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో తమిళ రాజకీయ ప్రముఖులతో పాటుగా కోలీవుడ్ సినీ ప్రముఖులు తరలివచ్చారు.
సీఎం స్టాలిన్, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై తదితర రాజకీయ ప్రముఖులు ఈ వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు.
ఇక సినీ ప్రముఖులు రజనీకాంత్, డైరెక్టర్ లోకేష్ కనక రాజ్, సత్యరాజ్ ,కుష్బూ, విజయ్ సేతుపతి, శివ కార్తికేయన్, స్నేహ రోజా, ఉపేంద్ర, డైరెక్టర్ శంకర్, ప్రభుదేవా తదితరులు హాజరయ్యారు.
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా పెద్ద కూతురు ఐశ్వర్య, కోలీవుడ్ డైరెక్టర్ కమ్ కమెడియన్ తంబి రామయ్య కుమారుడు యంగ్ హీరో ఉమాపతిల వివాహం తాజాగా జరిగింది. చెన్నైలోని హనుమాన్ ఆలయంలో సంప్రదాయ పద్దతిలో వీరిద్దరి వివాహ వేడుక జరిగింది.