The Road Movie | ‘పొన్నియన్ సెల్వన్’ వంటి భారీ హిట్ తర్వాత కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష (Trisha Krishnan) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ది రోడ్ (The Road). రివెంజ్ ఇన్ 462 కిలోమీటర్స్ (Revenge in 462 kms) అనేది ఉప శీర్షిక. అరుణ్ వసీగరన్ దర్శకత్వం వహించాడు.
The Road Movie | ‘పొన్నియన్ సెల్వన్’ వంటి భారీ హిట్ తర్వాత కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష (Trisha Krishnan) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ది రోడ్ (The Road). రివెంజ్ ఇన్ 462 కిలోమీటర్స్ (Revenge in 462 kms) అనేది ఉప శీర్షిక. అరుణ్ వసీగరన్ దర్శకత్వం వహించాడు. డ్యాన్సింగ్ రోజ్‌గా పాపులర్ అయిన మాలీవుడ్ నటుడు షబీర్ (Shabeer Kallarakkal) ఈ సినిమాలో కీ రోల్ పోషించాడు. అక్టోబర్ 6న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. అయితే ఈ సినిమాలో త్రిష నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ చిత్రం ఓటీటీ లాక్ చేసుకుంది.
ప్రముఖ తమిళ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా(Aha)లో నవంబర్ 06 నుంచి స్ట్రీమింగ్ అవ్వనున్నట్లు మేకర్స్ సోషల్ మీడియాలో వెల్లడించారు. మొదట ఈ చిత్రాన్ని తమిళ ఓటీటీలో విడుదల చేయనున్నారు. ఆ తర్వాత వివిధ భాషల్లో ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏఏఏ సినిమా బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్ సంగీతం అందించాడు.