ICMR: భోజనానికి ముందు కానీ, తరువాత కానీ…టీ , కాఫీలు తాగుతున్నారా..అయితే తస్మాత్‌ జాగ్రత్త!

Mana Enadu:ఇండియాలో చాలా మంది ప్రజలు తరచూ టీ, కాఫీలు తాగడానికి అలవాటు పడినట్లు పేర్కొంది. అయితే టీ లేదా కాఫీని భోజనానికి ముందు లేదా తర్వాత తీసుకోవడం ప్రమాదం అని హెచ్చరించింది. టీ, కాఫీలలో కెఫిన్ ఉంటుంది. ఇది కేంద్ర నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుందని వివరించింది. అయితే టీ, కాఫీలను పూర్తిగా మానేయమని చెప్పకపోయినా కూడా వాటిలో ఉండే కెఫిన్ కంటెంట్ నుంచి జాగ్రత్తలు పాటించాలని తెలిపింది.

పానీయాలలో టానిన్ సమ్మేళనం ఉంటుంది. అందువల్ల టానిన్లు శరీరంలోని ఐరన్ శోషణకు ఆటంకం కలిగిస్తాయని తెలిపింది. అంతే టానిన్ శరీరంలో ఉండే ఐరన్ కంటెంట్‌ను తగ్గించేలా చేస్తుంది. టానిన్ వల్ల జీర్ణాశయంలోని ఐరన్ తగ్గిపోతుంది. అంతేకాదు ఆహారం ద్వారా రక్తంలో ప్రవేశించే ఐరన్ కూడా తగ్గుతుంది. శరీరంలో హిమోగ్లోబిన్ ను తయారు చేసేందుకు ఐరన్ అనేది అవసరం. అందువల్ల ఐరన్ స్థాయిలను తగ్గించేలా పనిచేసే కాఫీలను తీసుకోవడం ప్రమాదం అని ICMR పేర్కొంది.

ఒక కప్పు బ్రూ కాఫీలో 80 నుంచి 120 గ్రాముల కెఫిన్ ఉంటుంది. అదే ఇన్ స్టంట్ కాఫీలో 50 నుంచి 65 మిల్లీ గ్రాములు, టీలో 30 నుంచి 65 మిల్లీ గ్రాముల కెఫిన్ ఉంటుంది. అయితే టీ లేదా కాఫీలను ఎంత తక్కువగా తాగితే ఆరోగ్యానికి అంత మంచిది అని తెలిపింది. ముఖ్యంగా భోజనానికి ముందు లేదా తర్వాత టీ, కాఫీలు అస్సలు తాగకూడదని హెచ్చరించింది. ఒక వేళ తాగాలని అనుకున్న భోజనానికి గంట ముందు గంట తర్వాత తీసుకోవాలని పేర్కొంది.

 

Share post:

లేటెస్ట్