కొత్త రేషన్ కార్డ్స్ ఎవరికి ఇస్తున్నారు? అర్హులు వీరే

ManaEnadu:తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆరు గ్యారెంటీ పథకాలపై తొలి సంతకం చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీ పథకాలతో ప్రజల్లోకి వెళ్లింది కాంగ్రెస్ పార్టీ. ఈ పథకాలకు ఆకర్షితులైన తెలంగాణ ప్రజలు ఈసారి కాంగ్రెస్ కి పట్టం కట్టారు. ఇప్పటికే ఆరు గ్యారెంటీ పథకాల్లో మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు ప్రారంభించారు. రాష్ట్రంలో ఎప్పటి నుంచో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. అయితే కొత్త రేషన్ కార్డ్స్ ఎవరికి ఇస్తున్నారు? ఎవరు అర్హులు అన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

 

రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు జారీ కాకపోవడం వల్ల చాలా మంది ఆరు గ్యారెంటీ పథకాలకు దూరమవుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ సర్కార్ అందించిన శుభవార్త విని సంతోషం వ్యక్తం చేస్తున్నాు. రాష్ట్రంలో ఇప్పటికీ 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రజా పాలన కార్యక్రమం ద్వారా 20 లక్ష మందికి పైగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఈసారి ఎవరికి పడితే వారికి కాకుండా.. అర్హులైన వారికే ఫుడ్ సేఫ్టీ కార్డులు అందేలా చర్యలు తీసుకుంటుంది. మొదట స్క్రూటినీ చేసిన తర్వాత ఫిజికల్ వెరిఫికేషన్ చేపట్టిన తర్వాత అర్హులని నిర్ధారించిన వారికే రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

సంబంధిత ఎమ్మార్వో లేదా అసిస్టెంట్ సివిల్ సప్లయ్ ఆఫీసర్ కు అందజేస్తారు. మొత్తం ప్రక్రియను జిల్లా కలెక్టర్ పర్యవేక్షిస్తారు. దరఖాస్తుదారుడు తెలంగాణకు చెందిన వాడై ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు అనర్హులు. సొంత కారు, బంగ్లా లాంటివి ఉండకూడదు, ఇన్‌కం ట్యాక్స్ చెల్లించేవారు అనర్హులు దారిద్యరేఖ దిగువన ఉన్నవారే అర్హులు. రేషన్ కార్డుల మంజూరు లో ఎక్కడ తేడా వచ్చినా వెరిఫికేషన్ అధికారిదే పూర్తి బాద్యత. వారే జవాబుదారి కనుక అన్ని సరైన ఆధారాలు, వివరాలు అందజేయాల్సి ఉంటుంది. దరఖాస్తు దారుడి ఇంటిని విజిట్ చేసినట్లుగా సర్టిఫికెట్ లో తేది, సమయంతో పాటు సేకరించిన వివరాలు పొందుపరుస్తారు. దరఖాస్తుదారుడి ఆర్తిక స్థితిగతులు, జీవన విధానాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత.. అతడు/ఆమె రేషన్ కార్డుకు అర్హులా కాదా? అని నిర్ణయిస్తారు. దరఖాస్తుదారుడు అందించిన సమాచాంలో ఏదైనా బోగస్ అని తేలితే రేషన్ కార్డు మంజూరు ఆగిపోతుంది. అర్హులైన వారు ఆన్ లైన్ లో చెక్ చేసుకోవచ్చు.. లేదా సంబంధిత అధికారులకు తమ వివరాలు అందించి సమాచారం తెలుసుకోవచ్చు.

Related Posts

Rashmika Mandanna: ‘ఛావా’ ప్రమోషన్స్.. రష్మిక కామెంట్స్‌పై కన్నడిగుల ఫైర్

ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో నేషన్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) జోరు కొనసాగుతోంది. టాలీవుడ్(Tollywood), బాలీవుడ్(Bollywood) అనే తేడా లేకుండా వరుసబెట్టి ఆఫర్లు సొంతం చేసుకుంటోంది. దీంతో దక్షిణాది ఇండస్ట్రీలలో ఆమె పట్టిందల్లా బంగారమే అవుతోంది. ఇటీవల యానిమల్(Animal), పుష్ప-2(Pushpa2)తో సూపర్…

Gold&Silver Price: తగ్గిన బంగారం ధరలు.. కేజీ వెండి రేటు ఎంతంటే?

గత 15 రోజులుగా చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు(Gold Rates) ఎట్టకులకు తగ్గాయి. ఈనెలలో రికార్డు స్థాయికి చేరిన పుత్తడి ధర సామాన్యులకు అందుబాటులో లేకుండా పైపైకి ఎగబాకింది. ఈ క్రమంలో బంగారు ఆభరణాల(gold jewellery)కు డిమాండ్‌ 80శాతం వరకు పడిపోయింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *