Pebbair Market మార్కెట్ యార్డులో అగ్నిప్రమాదం..భారీగా ఆస్తినష్టం

Fire Broke At Agri Godown: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. వనపర్తి జిల్లా (Wanaparthy Distic)పెబ్బేరులోని మార్కెట్ యార్డులో రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. మున్సిపల్ కేంద్రంలోని ఆధునిక వ్యవసాయ మార్కెట్ యార్డులో (Market Yard) మంటలు ఒక్కసారిగా చెలరేగాయి.

మంటల్లో దాదాపు 70 వేల వరి ధాన్యం బస్తాలు కాలి బూడిదయ్యాయి. వీటి విలువ సుమారు రూ.15 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. 40 లక్షల గన్నీ బ్యాగులు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

ఈ ఘటనపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Thummula Nageswar Rao) స్పందించారు. అధికారులు వెంటనే అక్కడికి వెళ్లి పరిశీలించాలని ఆదేశించారు. ఈ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు. ఎంతమేరా నష్టం జరిగిందో అంచనా వేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.

Related Posts

Bahraich : యూపీని వణికిస్తున్న తోడేళ్లు.. దాడులకు అదే కారణమా?

ManaEnadu:ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar Pradesh) రాష్ట్రాన్ని తోడేళ్లు వణికిస్తున్నాయి. ముఖ్యంగా బహరయిచ్‌ జిల్లాలో తోడేళ్ల దాడులు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సుమారు 50 గ్రామాల ప్రజలు తోడేళ్ల వల్ల క్షణక్షం భయంతో బతుకుతున్నారు. అయితే ఇలా తోడేళ్లు వరుస దాడులకు…

రేప్ చేస్తే లైఫ్‌టైమ్ జైల్లోనే.. ‘అపరాజిత బిల్లు’కు బంగాల్ అమోదం

ManaEnadu:పశ్చిమ బెంగాల్‌ (West Bengal) కోల్‌కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన (Kolkata Doctor Rape Murder) దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో కోల్‌కతా పోలీసులు, ఆ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై పెద్ద…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *