Akhanda 2 : ‘అఖండ 2’ షూటింగ్​ లీక్ చేసిన కాస్ట్యూమ్ డిజైనర్..

Akhanda 2 : బోయపాటి – బాలయ్య బాబు కాంబో అంటే ఏ రేంజ్ హిట్స్ పడతాయో అందరికి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ సినిమాలు ఒకదానికి మించి ఒకటి భారీ హిట్ అయ్యాయి. అఖండ సినిమాలో అఘోరా లుక్ లో బాలయ్య బాబు అదరగొట్టారు. అఖండగా బాలయ్య చేసిన మాస్ యాక్షన్ సీన్స్ అయితే థియేటర్స్ లో దద్దరిల్లిపోయాయి. 2021లో వచ్చిన అఖండ సినిమా 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి భారీ విజయం సాధించింది.

అఖండ సినిమాకు సీక్వెల్ ఉంటుందని బోయపాటి(Boyapati Srinu) గతంలోనే ప్రకటించారు. దీంతో ఎప్పుడెప్పుడు మళ్ళీ బోయపాటి – బాలయ్య బాబు(Balakrishna) కాంబోలో అఖండ 2 సినిమా వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతం బోయపాటి శ్రీను అఖండ 2 స్క్రిప్ట్ మీదే వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అఖండ సినిమాలో బాలయ్య అఘోరా లుక్ కి కూడా బాగా ప్రశంసలు వచ్చాయి. ఆ లుక్ డిజైన్ చేసింది కాస్ట్యూమ్ డిజైనర్ రామ్స్.

అఖండ 2 వర్క్ మొదలైందని చెప్పడంతో బాలయ్య అభిమానులు సంతోషిస్తున్నారు. ఈ సంవత్సరం చివర్లో అఖండ 2 మొదలయి వచ్చే సంవత్సరం ఈ సినిమా రిలీజ్ అవుతుందని టాలీవుడ్ సమాచారం. బాలయ్య – బోయపాటి హ్యాట్రిక్ కాంబో మరోసారి తమ హిట్స్ ని కంటిన్యూ చేయాలని చూస్తున్నారు. నిన్న రాత్రే లెజెండ్ పదేళ్ల వేడుక జరగగా బాలయ్య, బోయపాటి ఇద్దరూ వచ్చారు. బోయపాటి మరోసారి బాలయ్యతో పనిచేస్తాను అని క్లారిటీ కూడా ఇచ్చారు.

Related Posts

L2 Empuraan : ఓటీటీలోకి ‘ఎల్‌ 2: ఎంపురాన్‌’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) తెరకెక్కించిన లేటెస్ట్ సినిమా ‘ఎల్‌ 2: ఎంపురాన్‌’ (L2: Empuraan). లాలెట్టా మోహన్ లాల్ (Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మార్చి 27వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ…

సమంతకు బిగ్ షాక్.. ‘సిటడెల్‌’ సీజన్‌-2 రద్దు

బాలీవుడ్ స్టార్ వరుణ్‌ ధావన్‌ (Varun Dhawan), టాలీవుడ్ బ్యూటీ సమంత (Samantha) జంటగా నటించిన యాక్షన్‌ థ్రిల్లింగ్‌ వెబ్‌ సిరీస్‌ ‘సిటడెల్‌: హనీ-బన్నీ’  ప్రియాంక చోప్రా, రిచర్డ్‌ మ్యాడెన్‌ నటించిన వెబ్‌ సిరీస్‌కి ఇండియన్‌ వెర్షన్‌గా ఇది రూపొందింది. దీని…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *