Prabhas Kalki 2898 AD Movie Review : 600 కోట్ల బడ్జెట్ – అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి బలమైన క్యాస్టింగ్ – తొలి రోజే రూ.100 కోట్లతో బాక్సాఫీస్‌ను కొల్లగొట్టే సత్తా ఉన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – అత్యున్నత సాంకేతికత, కళ్లు చెదిరే వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ - ఇదీ అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ స్టామినా. సైన్స్ ఫిక్షన్‌కు మైథాలజీతో ముడిపెడుతూ ప్రేక్షుకలకు సరికొత్త అనుభూతిని పంచేందుకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేసిన అతి పెద్ద భారీ ప్రయత్నం. దీంతో ఏ సినిమాకు లేనంత హైప్, బజ్ కల్కి చుట్టూనే చేరింది. అదే విధంగా ఊహించని రేంజ్లో కల్కి టికెట్ బుకింగ్స్ రికార్డులు సృష్టించాయి.
మహాభారతంలోని కొన్ని ముఖ్య ఘట్టాలను ఆధారంగా చేసుకుని కల్కి 2898 ఏడీ సినిమాను రూపొందించారు. సినిమాలో అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్, యాస్కిన్‌గా కమల్ హాసన్, భైరవగా ప్రభాస్, సుమతిగా దీపిక పదుకొణె, రోక్సీగా దిశా పటానీ నటించారు. ఇక భైరవ దోస్త్‌గా బుజ్జి అనే స్పెషల్ రొబోటిక్ కారును రూ.7 కోట్ల ఖర్చుతో ప్రత్యేకంగా డిజైన్ చేయించి మరీ వినియోగించారు.
ప్రభాస్ సినిమా కావడంతో ఓవర్సీస్ సహా దేశంలోని అన్ని థియేటర్లలోనూ ప్రేక్షకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ప్రీమియర్స్ మొదటి షో చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఆడియెన్స్ సోషల్ మీడియా వేదికగా తమ రివ్యూలను పోస్ట్ చేశారు.
ఓవర్సీస్ ప్రీమియర్స్ భారీ బ్లాక్ బస్టర్ – యూఎస్ఏ ప్రీమియర్స్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం “కల్కి యూనానిమస్ ఎపిక్ బ్లాక్ బస్టర్. అద్భుతమైన విజువల్ వండర్ మాస్టర్‌పీస్. ఇండియన్ సినిమాలో ఎప్పుడు చూడనటువంటి చిత్రమంటున్నారు.
ఇక మొత్తంగా ఓవర్సీస్ ప్రీమియర్స్ నుంచి భారీ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వినిపిస్తోంది. ఓపెనింగ్స్ డే అడ్వాన్స్ సేల్స్ రూ.100 కోట్లు దాటేశాయని అంటున్నారు.