Mana Enadu| టాలీవుడ్ నటుడు మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా వస్తున్న తాజా చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). మోహన్ బాబు నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రానికి మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్‌కుమార్ సింగ్ (Mukesh Kumar Singh) దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే.
Kannappa Movie | టాలీవుడ్ నటుడు మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా వస్తున్న తాజా చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). మోహన్ బాబు నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రానికి మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్‌కుమార్ సింగ్ (Mukesh Kumar Singh) దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన చిత్రబృందం తాజాగా టీజర్‌ను విడుదల చేసింది.
ఇక ఈ టీజర్ చూస్తే.. కథ రివీల్ చేయకుండా ఫుల్ యాక్షన్ ప్యాక్డ్‌గా సాగింది. అయితే ఈ సినిమాలో మొదట అగ్ర హీరో ప్రభాస్ శివుడి పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ శివుడి పాత్రలో అక్షయ్ కుమార్ నటించబోతున్నట్లు సమాచారం. కాగా దీనిపై మేకర్స్ క్లారిటీ ఇవ్వవలసి ఉంది. ఈ సినిమా విషయానికి వస్తే.. కన్నప్ప మొదట నాస్తికుడు ఆ తర్వాత శివుడికి భక్తుడిగా మారతాడు. ఇక అతడు శివుడి భక్తుడిగా ఎలా మారాడు అనేది తెలియాలంటే సినిమా వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.
విష్ణు టైటిల్ రోల్ పోషిస్తున్న కన్నప్పలో మోహన్‌బాబు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మోహన్ లాల్, నయనతార, మధుబాల, శరత్‌కుమార్, శివరాజ్‌కుమార్ ఇతర నటీనటులు కీ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ, స్టీఫెన్ దేవసి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సమకూరుస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయిమాధవ్, తోట ప్రసాద్ స్క్రీన్‌ప్లే సమకూరుస్తున్నారు.