Satyabhama Trailer Launch Event : చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తున్న చిత్రం సత్యభామ. లేడీ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి సుమన్ చిక్కాల దర్శకుడు. నవీన్ చంద్ర కీలక పాత్రను పోషిస్తున్నాడు. అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మే 31 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో ఇప్పటికే చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలుపెట్టింది.
అందులో భాగంగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేసేందుకు ముహూర్తాన్ని ఫిక్స్ చేసింది. మే 24న ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు మూవీ యూనిట్ తెలియజేసింది. ఆ రోజు సాయంత్రం 6.30 గంటలకు హైదరాబాద్‌లోని ఐటీసీ కోహెనూర్‌లో నిర్వహించనున్నట్లు చెప్పింది. నందమూరి అందగాడు, స్టార్ హీరో బాలయ్య ఈ వేడకకు ముఖ్య అతిథిగా విచ్చేసి ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నాడు.