Mana Enadu: ఆనంద్ దేవరకొండ.. ఇటీవల ‘గం. గం.. గణేశా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ మే 31 న థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఎలాంటి అనౌన్స్ మెంట్ లేకుండా సైలెంట్ గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది.
Gam Gam Ganesha Movie On OTT : ఆనంద్ దేవరకొండ.. ఇటీవల ‘గం. గం.. గణేశా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. క్రైం, కామెడీ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ మూవీ మే 31 న థియేటర్స్ లో రిలీజ్ అయింది. సినిమాలో డిఫరెంట్ లుక్ లో కనిపించిన ఆనంద్ ఆనంద్ దేవరకొండ ఇందులో ఫస్ట్ టైం తనలోని కామెడీ యాంగిల్ ని బయటపెట్టాడు. ఆడియన్స్ నుంచి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ పెద్దగా కలెక్షన్స్ రాలేదు. ఈ క్రమంలోనే ఎలాంటి హడావుడి లేకుండానే ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
‘గం. గం.. గణేశా’ మూవీ ఎలాంటి అనౌన్స్ మెంట్ లేకుండా సైలెంట్ గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని కొనుగోలు చేసిన అమెజాన్ ప్రైమ్ సంస్థ ఓటీటీ రిలీజ్ విషయంలో మేకర్స్ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. దీంతో ఈ సినిమా ఓటీటీలోకి వచ్చిన విషయం చాలామందికి తెలీదు. అటు థియేటర్స్ లోనూ ఎక్కువ రోజులు ఆడలేదు.
రిలీజైన ఈ మూవీ కేవలం 20 రోజులకే ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ వీకెండ్ మంచి సస్పెన్స్ అండ్ కామెడీ మూవీ చూడాలనుకునే వారికి ‘గం.గం.. గణేశా’ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.. థియేటర్స్ లో ఈ సినిమాని మిస్ అయ్యుంటే ఇప్పుడు ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.