Bhaje Vaayu Vegam: కార్తీకేయ భజే వాయు వేగం ఈనెల 31న వరల్డ్​ రిలీజ్​

Mana Enadu: ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ (uv creations)సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై హీరో కార్తికేయ(Kartikeya gummakonda) గుమ్మకొండ హీరోగా నటిస్తున్న సినిమా “భజే వాయు వేగం”. ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 31న “భజే వాయు వేగం” సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

ఈ సినిమాను నేషనల్ వైడ్ గా ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని తన ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ (dheeraj mogilineni entertainment)సంస్థ ద్వారా రిలీజ్ చేస్తున్నారు. ‘బేబి’, ‘గుంటూరు కారం’, ‘హనుమాన్’, ‘గామి’, ‘ఓం భీమ్ బుష్’, ‘టిల్లు స్క్వేర్’ వంటి సూపర్ హిట్ సినిమాల డిస్ట్రిబ్యూటర్ గా సక్సెస్ ఫుల్ జర్నీ చేస్తున్నారు ధీరజ్ మొగిలినేని. ఆయన తమ టీమ్ లో జాయిన్ కావడాన్ని హ్యాపీగా అనౌన్స్ చేశారు.

Share post:

లేటెస్ట్