Mana Enadu: ‘ ‘మహారాజ’ గురించి అందరూ గొప్పగా చెబుతుంటే ఆనందంగా, ఎమోషనల్‌గా ఉంది. తెలుగు ప్రేక్షకులు నాపై చూపిస్తున్న అభిమానాన్ని జీవితంలో మరిచిపోలేను. మీ అభిమానం చూస్తుంటే ఇది నా హోమ్‌టౌన్ అనిపిస్తోంది.’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు విజయ్ సేతుపతి. ఆయన హీరోగా రూపొందిన చిత్రం ‘మహారాజ’.
నిథిలన్ సామినాథన్ దర్శకుడు. సుధన్ సుందరం, జగదీశ్ పళనిసామి నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ సినిమా థ్యాంక్‌యూ మీట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ సేతుపతి మాట్లాడారు. దర్శకులు గోపీచంద్ మలినేని, మారుతి, బుచ్చిబాబు, అనిల్ కన్నెగంటి అతిథులుగా విచ్చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందించారు. ఇంకా దర్శకుడు నిథిలన్ సామినాథన్, పంపిణీధారులు శశిధర్‌రెడ్డి కూడా మాట్లాడారు.