My Dear Donga : ఆహాలో ఏకంగా 25 లక్షల మంది చూసిన సినిమా.. అదరగొడుతున్న ‘మై డియర్ దొంగ’..

Mana Enadu:కామెడీ ఎంటర్టైనర్ తో పాటు లవ్ ఎమోషన్స్ తో ఈ మై డియర్ దొంగ సినిమా నిర్మించారు. కథ విషయానికొస్తే.. లవర్ తనని సరిగ్గా పట్టించుకోని ఓ అమ్మాయికి తన ఇంట్లో పడ్డ దొంగతో పరిచయం అయి రిలేషన్ పై క్లారిటీ వస్తే ఎలా ఉంటుంది అని కామెడీ కథాంశంతో చూపించారు. ఆహా ఓటీటీలో మై డియర్ దొంగ దూసుకుపోతుంది. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు.

My Dear Donga : తెలుగు ఓటీటీ ఆహాలో రెగ్యులర్ గా కొత్త కొత్త సినిమాలు, సిరీస్ లు వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఏప్రిల్ 19న ఆహా ఓటీటీలో ‘మై డియర్ దొంగ’ అనే కొత్త సినిమా రిలీజయింది. అభినవ్ గోమఠం(Abhinav Gomatam), షాలిని కొండేపూడి, దివ్య శ్రీపాద, నిఖిల్, శశాంక్.. ముఖ్య పాత్రల్లో షాలిని కొండేపూడి రచయితగా క్యామ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై గోజల మహేశ్వర్‌రెడ్డి నిర్మాణంలో సర్వాంగ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

ఈ సక్సెస్ మీట్ లో ఆహా మార్కెటింగ్ హెడ్ రాజశేఖర్ మాట్లాడుతూ.. మై డియర్ దొంగకి రెస్పాన్స్ బాగా వచ్చింది. చిన్న సినిమాల్లో ఇది పెద్ద సినిమా. ఇప్పటివరకు ఆహాలో మై డియర్ దొంగని 25 లక్షల మంది చూశారు. దీనిపై ఆహా టీం సంతోషంగా ఉంది. మై డియర్ దొంగ రిటర్న్స్ కోసం ఎదురుచుస్తున్నాం అని తెలిపారు. ఆహా టీం శ్రావణి మాట్లాడుతూ.. అందరూ బాగా నటించారు, బాగా పనిచేసారు ప్రాజెక్టు కోసం. మై డియర్ దొంగ విడుదలైనప్పటి నుండి ఇప్పటివరకూ కూడా టాప్ ట్రెండింగ్ లో నడుస్తోంది అని తెలిపారు.

మై డియర్ దొంగ నిర్మాత మహేశ్వర్‌‌రెడ్డి మాట్లాడుతూ.. సినిమా చూసిన వాళ్లంతా పాజిటివ్ గానే చెప్తున్నారు. సినీ పరిశ్రమ నుంచి కూడా చాలా మంది ఫోన్స్ చేసి అభినందిస్తున్నారు. సినిమా చూడని వాళ్ళు త్వరగా చూడండి అని అన్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్, రైటర్ శాలిని మాట్లాడుతూ.. ఈ సినిమాకి వచ్చిన రివ్యూస్ అన్ని చదివాను. ఎక్కడా నెగిటివ్ రివ్యూ రాలేదు. ఇంత గొప్ప పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదు. నన్ను నమ్మి ఈ ప్రాజెక్టు లో భాగమయిన వారందరికీ ధన్యవాదాలు. ఈ సినిమా క్లైమాక్స్ అదే. ఇంకా సీక్వెల్ అనుకోలేదు. క్లైమాక్స్ గురించి కూడా రకరకాల కథలు కామెంట్స్ రూపంలో వచ్చాయి. హీరోయిన్ గా, రచయితగా నన్ను నేను ప్రజెంట్ చేసుకున్నాను ఈ మై డియర్ దొంగ సినిమాతో అని తెలిపింది. ఇక ఈ సినిమాలో దొంగగా నటించిన అభినవ్ గోమటం కూడా అందరికి ధన్యవాదాలు తెలుపుతూ షాలిని గత పదేళ్లుగా తెలుసు అని, చాలా కష్టపడి ఇప్పుడు సక్సెస్ కొట్టింది అని తెలిపాడు.

Related Posts

Naga Chaitanya: స్టైలిష్ లుక్‌లో చైతూ.. ‘NC24’ షూటింగ్ షురూ

‘తండేల్’ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు హీరో అక్కినేని నాగ చైతన్య(Akkineni Naga Chaitanya), డైరెక్టర్ చందూ మొండేటి(Chandu Mondeti) తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్(Box Office) వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *