Vey Dharuvey OTT: ఓటీటీలోకి రాబోతున్న మాస్ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ప్రముఖ తెలుగు డైరెక్టర్ పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరాం శంకర్ గురించి అందరికీ తెలుసు.. పలు సినిమాల్లో నటించి మంచి గుర్తుంపు తెచ్చుకున్నాడు. నటుడుగా మార్కులు పడ్డాయి కానీ సరైన హిట్ సినిమా పడలేదు..

దాంతో ఈ హీరో చాలా కాలం గ్యాప్ తీసుకొని కథల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు.. యాక్షన్ మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన వెయ్ దరువెయ్ సినిమాలో నటించాడు.. ఆ సినిమా మార్చి 15 న విడుదలైంది..

గ్యాప్ తీసుకొని వచ్చిన ఈ సినిమా కూడా ఆశించినస్థాయిలో ఫలితాలను అందుకోలేక పోయింది.. ఓ మాదిరిగా ప్రేక్షకులను అలరించిందనే చెప్పాలి.. సునీల్‌, సత్యంరాజేష్ కీలక పాత్రలు పోషించారు. ఫేక్ సర్టిఫికెట్స్‌తో ఉద్యోగాలు పొందాలని భావించి అడ్డదారులు తొక్కుతున్న యువత ఎలా కష్టాల పాలవుతున్నారనే విషయాన్ని హైలెట్ చేస్తూ ఈ సినిమాలో చూపించారు.. పాయింట్ బాగానే ఉన్నా కూడా సినిమా జనాలకు అంతగా రీచ్ అవ్వలేక పోయింది..

ఈ సినిమా విడుదలైన మూడు వారాలకే ఓటీటీలో విడుదల కాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నట్లు తెలిసింది. ఏప్రిల్ 12 నుంచి ఈ మాస్ యాక్షన్ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం.. దీనిపై త్వరలోనే అధికార ప్రకటన రాబోతుంది.

Related Posts

మెస్మరైజింగ్ విజువల్స్.. దద్దరిల్లిన BGM.. ‘KINGDOM’ సౌండ్ ట్రాక్ ర్యాంపేజ్

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ప్రధాన పాత్రలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘కింగ్‌డమ్‌ (KINGDOM)’. ఇటీవలే ఈ చిత్ర టీజర్ రిలీజై సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది. ఇక తాజాగా మేకర్స్ ఈ సినిమా ఒరిజినల్…

ఒక్క సినిమాతో సూపర్ క్రేజ్.. బుల్లిరాజుకు షాకింగ్ రెమ్యునరేషన్

ఈ ఏడాది సంక్రాంతి పండుగకు వచ్చిన సినిమాల్లో ‘సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam)’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఇక…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *