భార్యతో విడాకులు(Divorce) ఇప్పించాడని బావమరిదిని బావ కత్తితో పొడిచి చంపిన సంఘటన హైదరాబాద్‌లోని బహదూర్‌పురాలో చోటుచేసుకుంది.
Kishanbag:కిషన్‌బాగ్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ రషీద్‌కు షకిల్ అహ్మద్ చెల్లిని ఇచ్చి పెళ్లి చేశాడు. దంపతులు మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతుండడంతో పలుమార్లు పెద్ద మనుషులు సర్ది చెప్పారు. భార్య, భర్తల మధ్య గొడవలు ఎక్కువగా షకిల్ అహ్మద్ కుటుంబ సభ్యులు రషీద్‌కు విడాకులు ఇచ్చారు. భార్య, తాను విడిపోవడానికి షకిలే కారణమని పగ పెంచుకున్నాడు.
నందిముస్లైగూడ రోడ్డుపై షకిల్‌తో రషీద్ గొడవకు దిగాడు. చూస్తుండగానే కత్తి తీసుకొని పలుమార్లు బావమరిదిని బావ పొడిచాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని శవ పరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని ఇన్‌స్పెక్టర్ రఘునాథ్ తెలిపారు.