Bhatti Vikramarka : హామీలు అధ్యయనం చేసి అమలులోకి తెస్తున్నాం

Mana Enadu: ఇచ్చిన హామీల అమలు లోతుగా అధ్యయనం చేసి అమలులోకి తెస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రుణమాఫీ త్వరలోనే చేయబోతున్నామని తెలిపారు.

BRS అరుస్తుందని ఆయన మండిపడ్డారు. మీరు అరిచి గీ పెట్టాల్సిన అవసరం లేదని భట్టి విక్రమార్క అన్నారు. రైతు భరోసా మొత్తము వ్యవసాయం అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నామన్నారు. మేము ఇచ్చే ప్రతి పథకం ప్రజల సొమ్ముతోనే.. ప్రజల సొమ్ముకు మేము కస్టోడీయన్ మాత్రమే అని ఆయన వెల్లడించారు.

ప్రజల మధ్య చర్చకు పెట్టి..అందరి అభిప్రయాలు తీసుకుంటామని, బడ్జెట్ సమావేశాల కంటే ముందే రైతు భరోసా పై అభిప్రాయం సేకరిస్తామన్నారు. అసెంబ్లీ లో నివేదిక పెడతామని, ప్రజల ఆలోచన మేరకే సంపద పంచుతామన్నారు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka). రైతులు.. ట్యాక్స్ చెల్లించే వారూ.. మేధావులతో మాట్లాడతామని, బీఆర్‌ఎస్‌ వాళ్ళు ఆశ పడుతున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఎదో ఒకటి చేస్తే బాగుండు.. అని ఆయన వ్యాఖ్యానించారు.

పాత పది జిల్లాల్లో అభిప్రాయం సేకరిస్తున్నట్లు తెలిపారు. నా నియోజక వర్గం లో రైతు ఆత్మహత్య దురదృష్టకరమన్నారు. ఎవరు ప్రోత్సహించారు అనేది విచారణ జరుగుతుందన్నారు. ఎవరన్న చర్యలు తప్పవని, కేబినెట్ విస్తరణ అధిష్ఠాభం ఇష్టమన్నారు భట్టి విక్రమార్క. పీసీసీపై(PCC) త్వరగా నిర్ణయం చేయాలని చెప్పామన్నారు. పీసీసీ నియామక కసరత్తు మొదలు పెట్టారని, బీఆర్‌ఎస్‌ నేతలపై భట్టి(Bhatti) ఫైర్ అయ్యారు. రాష్ట్ర విభజన చట్టంలో 7 మండలాలు లేవని ఆయన అన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత BRSఅధికారంలో ఉండగా ఏడు మండలాలు విలోనం అయ్యాయని ఆయన పేర్కొన్నారు. పదేళ్లు గాలికి వదిలేసి.. ఇప్పుడు తగుదునమ్మ అని మట్లాడుతున్నారని, బీఆర్‌ఎస్‌ వల్లనే ఏడు మండలాలు కోల్పోయామన్నారు. దీక్షకు కూర్చోండని ఆయన అన్నారు. హరీష్ రావు లాంటి కల్లబొల్లి మాటలు చెప్పామని, రైతులకు మేము ఆలస్యం చేయం నష్టం చేయమన్నారు. రేవంత్(CM Reventh) చాలా సార్లు చెప్పారని, చంద్రబాబు(Chandra babu) గురువు కాదు..సహచరులు అన్నారు. . చంద్రబాబు ఏపీ సీఎం.. రేవంత్ తెలంగాణ సీఎం అని భట్టి విక్రమార్క అన్నారు.

 

Related Posts

శబరిమల అయ్యప్ప ఆలయం మూసివేత

కేరళలోని శబరిమల (Sabarimala) అయ్యప్ప ఆలయాన్ని అధికారులు మూసివేశారు. మండలపూజ, మకర విళక్కు వార్షిక పూజలు ముగియడంతో సోమవారం ఉదయం ఆలయాన్ని మూసివేసినట్లు ట్రావెన్‌కోర్ దేవస్వమ్ బోర్డు (TDB) వెల్లడించింది. పందలం రాజకుటుంబ ప్రతినిధి త్రికేత్తనాల్ రాజరాజ వర్మ అయ్యప్ప దర్శనం…

ముక్కలేనిదే ముద్ద దిగదక్కడ.. దేశంలో అతిగా మాంసం తినే 10 రాష్ట్రాలివే

పండుగ ఏదైనా.. సందర్భం ఏదైనా.. పార్టీ చేసుకోవండ ఇప్పుడు పరిపాటిగా మారింది. ఇక ఆ పార్టీలో నాన్ వెజ్ (Non Veg) మాత్రం పక్కాగా ఉండాల్సిందే. చాలా మందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. అంతలా మన జీవితంలో మాంసాహారం భాగమైపోయింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *