Bhatti Vikramarka: మాజీ సీఎం కేసీఆర్​పై డిప్యూటీ సీఎం ఫైర్​

సూర్యాపేటలో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ (KCR) చేసిన కామెంట్స్ పై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పందించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి వారి నేతలు భారీగా కాంగ్రెస్ లోకి చేరుతుంటే తట్టుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. కెసిఆర్ మాటల్లో వాస్తవం లేదన్నారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు.

పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇంతలా దిగజారుతారా? కట్టుకథలు చెప్పి ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నించడంపై మండిపడ్డారు. మైక్ సమస్యలు వస్తే కరెంటు కోతలంటూ అబద్ధాలు మాట్లాడతారా? అని ప్రశ్నించారు.

‘బొగ్గు లభించే ప్రాంతానికి 350 కిమీ. దూరంలో యాదాద్రి(Yadadri power plant) పవర్ ప్లాంట్ పెట్టారని, దీని వల్ల బొగ్గు సరఫరా కోసం భారీగా ఖర్చవుతుంది. పర్యావరణ అనుమతులు పొందటంలో ఆలస్యం వల్ల నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది. తెలంగాణకు 4 వేల మెగావాట్ల విద్యుత్త ఇవ్వాలని విభజన చట్టంలోనే ఉంది. విభజన చట్టం ప్రకారమే రాష్ట్రానికి ఎన్టీపిసి మంజూరయింది. సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో భద్రాద్రి ప్లాంట్ నిర్మించాల్సి ఉంది. కానీ కమీషన్ల కోసం సబ్ క్రిటికల్ టెక్నాలజీతో భద్రాద్రి పవర్ ప్లాంట్ (Bhadradri Power Plant) చేపట్టారు’ అని భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు.

Share post:

లేటెస్ట్