CM ReventhReddy: ఫోన్ ట్యాపింగ్ కేసుపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తోలిసారి స్పందించారు. మాజీ మంత్రి కేటీఆర్ తన నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, గుట్టుగా ఫోన్లు సంభాషణలు వినడం దేశద్రోహమేన్ననారు.
ప్రస్తుతానికి కేసు విచారణ జరుగుతుందని, గుట్టుగా విన్నట్లు కేటీఆర్ పాత్ర తేలితే అందరిలాగే చర్లపల్లి జైలలో ఊసలు లెక్కించాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
అధికారులకు తానే ఆ రోజే చెప్పానని, వారు వినలేదని అన్నారు. ఇప్పుడు జైలుకు వెళ్తున్నారని తెలిపారు. తనను దెబ్బ తీయడానికి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పని చేయాలని భావిస్తున్నాయని చెప్పారు.
ఏ ముఖం పెట్టుకొని బీజేపీ ఓట్లు అడుగుతుందని రేవంత్ రెడ్డి నిలదీశారు. బోయలకు ప్రభుత్వంలో మంచి ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసి సమస్యల పరిష్కారం కోసం రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలని ఆయన సూచించారు.
గడీలను బద్దలుకొట్టి ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. మహబాబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు మనదే. మహబూబ్ నగర్ లో దెబ్బ తీస్తే కాంగ్రెస్ ను రాష్ట్రమంతా బలహాన పరచవచ్చని అనుకున్నారు. ఇచ్చిన హామీల్లో కొన్ని ఇప్పటికే అమలు చేశాం. ఎన్నికల కోడ్ వల్ల కొన్ని నిర్ణయాలు తీసుకోలేక పోయాం’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
ప్రజల్లో జగన్‌పై నమ్మకం పోయింది.. అందుకే విజయసాయి రాజీనామా: Sharmila
YCP సీనియర్ నేత, రాజ్యసభ MP విజయసాయి రెడ్డి(Vijaya Sai Reddy) ఇవాళ తన పదవికి స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా(Resignation) సమర్పించిన విషయం తెలిసిందే. అయితే ఆయన రాజీనామాపై APCC నేత వైఎస్ షర్మిల(YS Sharmila) స్పందించారు. మాజీ సీఎం, YCP…