Stephen Raveendra: ఐజీ స్టీఫెన్ రవీంద్రపై సీఎంకు పిర్యాదు

IG Stephen Raveendra : తెలంగాణ హోంగార్డ్స్ ఐజీ స్టీఫెన్ రవీంద్రపై సీఎం రేవంత్ రెడ్డికి కమాండ్ కంట్రోల్ డీఎస్పీ గంగాధర్ ఫిర్యాదు చేశారు. ఓ భూ వివాదంలో తాను తలదూర్చానంటూ.. ఎలాంటి ఎంక్వైరీ చేయకుండానే సస్పెండ్ చేశారాని ఆవేదన వ్యక్తం చేశారు. భూ కబ్జాదారులతో చేయి కలిపి తనను అకారణంగా విధుల నుంచి తొలగించారని సీఎం దృష్టికి తీసుకొచ్చారు.

సస్పెండ్ అయిన అధికారులపై 3 నుంచి 6 నెలలలోపు డిసిప్లినరీ యాక్షన్ కమిటీ ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవాలనే జీవో ఉందని గంగాధర్ గుర్తు చేశారు. కానీ.. ఏడాదిన్నరపాటు కేసును స్టీఫెన్ రవీందర్ పక్కన పెట్టడంతో ప్రమోషన్ విషయంలో తనకు అన్యాయం జరిగిందని అన్నారు.
తన బ్యాచ్ ఇన్ స్పెక్టర్లు డీఎస్పీలుగా ప్రమోషన్ పొందితే.. తన ప్రొఫెషనల్ లైఫ్ లో ఎదుగుదల లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన బ్యాచ్ వారి కంటే చాలా ఆలస్యంగా ప్రమోషన్ వచ్చిందని అన్నారు.

భూ వివాదంలో అప్పటి జిల్లా కలెక్టర్‌, పోలీస్ క‌మీషనర్‌ ఆదేశాలతోనే తాను కేసు నమోదు చేశానని గంగాధర్ చెప్పారు. కానీ ల్యాండ్ గ్రాబర్స్‌పై కేసు ఎందుకు పెట్టావని ఆరోపిస్తూ సస్పెండ్ చేశారని తన ఫిర్యాదులో తెలిపారు. శంకర్‌పల్లి మండలం జన్వాడ, కొల్లూరు గ్రామాల మధ్య ఓవర్‌ లాప్‌ భూ వివాదం విషయంలో తనకు అన్యాయం జరిగిందని అన్నారు.

Related Posts

Nirmal Kapoor: బాలీవుడ్‌లో విషాదం.. నిర్మల్ కపూర్ కన్నుమూత!

బాలీవుడ్‌(Bollywood)లో విషాదం చోటుచేసుకుంది. నటులు అనిల్ కపూర్, సంజయ్ కపూర్, నిర్మాత బోనీ కపూర్ తల్లి, నిర్మల్ కపూర్(90) కన్నుముశారు. ఇవాళ సాయంత్రం (మే 2) 5:45 గంటల ప్రాంతంలో ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్(Dhirubhai Ambani Hospital)లో ఆమె…

Aghori: లేడీ అఘోరీకి 14 రోజుల రిమాండ్.. సంగారెడ్డి సబ్ జైలుకు తరలింపు

గత కొంతకాలంగా తెలుగురాష్ట్రంలో హల్చల్ చేస్తున్న అఘోరీ నాగసాధు(Aghori Nagasadhu) పోలీసులు నిన్న అరెస్టు(Arrest) చేసిన విషయం తెలిసిందే. ప్రత్యేక పూజల(Special Pooja) పేరుతో ఓ మహిళ నుంచి రూ.10 లక్షలు తీసుకొని మోసం చేసిందన్న ఆరోపణలతో ఆమెను ఉత్తరప్రదేశ్‌(UP)లో అరెస్టు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *