తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం, శుక్రవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు.
Telangana: తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం, శుక్రవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖాధికారులు పేర్కొన్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్, మహబూబ్ నగర్ , మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములు, మెరుపులతో పాటు భారీ ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు వివరించారు.