Lemmon: వేసవి సీజన్​లో భారీగా పెరిగిన నిమ్మ ధరలు

ఎండల తీవ్రత రోజురోజుకి పెరుగుతోంది. దీంతో నిమ్మకాయల ధరలకు రెక్కలొచ్చాయి. కొద్ది రోజుల క్రితం వరకు అరడజను పెద్దసైజు నిమ్మకాయలకు రూ.20లకు విక్రయించారు. రెండురోజులుగా రూ.40-రూ.50ల ధర పలుకుతుంది. విడిగా అయితే పెద్దసైజు నిమ్మకాయ రూ.10, చిన్న సైజుదైతే రూ.5 చొప్పున అమ్ముతున్నారు. నిమ్మకాయల ఉత్పత్తి తగ్గడం, డిమాండ్ పెరగడమే ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు.

వేసవి తాపం తీర్చకునేందుకు మజ్జిగ, నాన్​వెజ్​ ఇలా ప్రతి దాంట్లో నిమ్మకాయ వాడతాము. నిమ్మరసం తాగడానికి వేసవిలో అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తాం. మరోవైపు చెరుకురసంలో ఇప్పటివరకు నిమ్మరసం ఇచ్చేవారు. నిమ్మకాయ రేట్లు పెరగడంతో కేవలం అల్లంతోనే సరిపెట్టుకోమని చెబుతున్నారు.

Share post:

లేటెస్ట్