HydMobiles:హైదరాబాద్‌సెల్​ఫొన్లు సూడాన్‌లో అమ్మేస్తున్నారు.. సెల్‌ఫోన్ల చోరీ ముఠా అరెస్ట్

Mana Enadu: హైదరాబాద్ నగరంలో ఖరీదైన సెల్‌ఫోన్లు చోరీ చేసి ఇతర దేశాలకు తరలిస్తున్న ముఠాను సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదుగురు సూడాన్ దేశస్థులతో పాటు 17 మందిని అరెస్టు చేసి.. వారి నుంచి కోటి 75 లక్షల రూపాయల విలువైన 703 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. చోరీ చేసిన ఫోన్లను ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో అన్‌లాక్ చేసి సూడాన్‌లో విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి మీడియాకు వివరించారు.

Stolen Cell Phones Recovered:నడుచుకుంటూ వెళుతున్న వారిని టార్గెట్‌గా చేసుకొని ఈ ముఠా మొబైల్ స్నాచింగ్ చేస్తుంది.కొన్ని సందర్భాల్లో మాటల్లో పెట్టి మొబైల్ స్నాచింగ్, నగదు చోరీ చేస్తున్నారు.రాత్రి 10 గంటలు తరువాత ఈ మొబైల్ స్నాచింగ్ చేస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు.మూడు కమిషనరేట్ల పరిధిలో ఇలాగే ముఠా మొబైల్స్​ స్నాచింగ్ చేస్తుంది. రోజుకు 3 నుంచి నాలుగు కేసులు నమోదు అయ్యాయి.ఈ మొబైల్స్​ స్నాచింగ్ చేస్తున్న ముఠా ఇంటర్నేషనల్ ముఠాగా గుర్తించారు. హైదరాబాద్‌లో దొంగతనం చేసిన మొబైల్స్‌ను సూడాన్‌కు పంపుతోంది ముఠా. సూడాన్ దేశానికి చెందిన ఐదుగురు అక్రమంగా హైదరాబాద్‌లో ఉంటున్నట్లు వెల్లడించారు.నిరుద్యోగ యువతకు జీతాలు ఇచ్చి మొబైల్ స్నాచింగ్ చేయిస్తున్నారు

Related Posts

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 14 మంది మావోయిస్టులు హతం

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి తుపాకీ మోత మోగింది. ఛత్తీస్‌గఢ్‌‌-ఒడిశా సరిహద్దుల్లోని గరియాబంద్‌ జిల్లాలోని కులారీ ఘాట్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య మంగళవారం ఉదయం ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. అంతకుముందు సోమవారం…

శబరిమల అయ్యప్ప ఆలయం మూసివేత

కేరళలోని శబరిమల (Sabarimala) అయ్యప్ప ఆలయాన్ని అధికారులు మూసివేశారు. మండలపూజ, మకర విళక్కు వార్షిక పూజలు ముగియడంతో సోమవారం ఉదయం ఆలయాన్ని మూసివేసినట్లు ట్రావెన్‌కోర్ దేవస్వమ్ బోర్డు (TDB) వెల్లడించింది. పందలం రాజకుటుంబ ప్రతినిధి త్రికేత్తనాల్ రాజరాజ వర్మ అయ్యప్ప దర్శనం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *