Sania Mirza Contest in Hyderabad: హైదరాబాద్ నుంచి ఎన్నికల బరిలోకి సానియా మిర్జా..?

పార్లమెంట్​ ఎన్నికల సెగ తెలంగాణకు తాకింది. అభ్యర్థల ఎంపిక టికెట్ల కేటాయింపు చేయడంలో పార్టీ నేతలు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. హైదరాబాద్ లోక్‌సభ అభ్యర్థిగా కాంగ్రెస్​ పార్టీ ఏకంగా సానియా మీర్జానే బరిలోకి దింపబోతున్నట్లు ప్రచారం తెరమీదకు వచ్చింది.

ఢిల్లీలో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ భేటీ అయ్యింది. ముఖ్యంగా తెలంగాణలోని అభ్యర్థులపై ప్రముఖంగా ఫోకస్ చేశారు. టికెట్ రేసులో ఇద్దరు ముగ్గురు నేతలు ఉండడం తో సర్వేలను దగ్గర పెట్టి ఎంపిక చేస్తున్నారు నేతలు. కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా సానియామీర్జాను కాంగ్రెస్ హైకమాండ్ దాదాపు ఓకే అయినట్టు ఢిల్లీ వర్గాల సమాచారం. ఆమె పేరును మాజీ ఎంపీ అజారుద్దీన్ ప్రతిపాదన చేశారని అంటున్నారు. సానియామీర్జా ఇమేజ్ కూడా కలిసివస్తుందని నేతల ఆలోచన. ఈ విషయమై కాంగ్రెస్ నేతలు సానియాతో చర్చించినట్టు రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది.

ఈ సీటు నుంచి బీజేపీ తరపున డాక్టర్ మాధవీలత బరిలో ఉన్నారు. ఆమెకు ధీటుగా నిలబెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేసింది. సానియామీర్జా గురించి చెప్పనక్కర్లేదు. గత ప్రభుత్వంలో తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. ఆమెకు దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా ఖ్యాతి గడించారు. ఈ క్రమంలో ఆమె సేవలను పార్టీకి ఉపయోగించుకోవాలన్నది కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా చెబుతున్నారు.

Share post:

లేటెస్ట్