LK Advani: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, భారతరత్న లాల్ కృష్ణ అద్వానీ బుధవారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. వృద్ధాప్య సమస్య కారణంగా అద్వానీని ఎయిమ్స్‌లో చేర్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఎయిమ్స్‌లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. లాల్ కృష్ణ అద్వానీ కుటుంబ సభ్యులు ఆయన పరిస్థితికి సంబంధించి వివరాలు వెల్లడించారు.
ప్రస్తుతం అద్వానీ ఆరోగ్యం కొంచెం విషమంగానే ఉందని తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు తెలిపారు. ఆయన వయస్సు 96 సంవత్సరాలు. అద్వానీకి ఈ ఏడాది భారతరత్న లభించింది. దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ప్రదానం చేసినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపిన ఆయన, ఇది తనకే కాదు, ఆయన ఆదర్శాలు, సిద్ధాంతాలకు కూడా దక్కిన గౌరవమని అన్నారు.