TS Cabinet: ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ.. షరతులతో అనుమతి ఇచ్చిన ఈసీ

Mana Enadu: తెలంగాణ కేబినెట్ ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో జరగనుంది. మంత్రి మండలి సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. జూన్‌ 4లోపు చేయాల్సిన అత్యవసర విషయాలపైనే చర్చించాలని ఈసీ ఆదేశించింది.

హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, రైతు రుణ మాఫీ అంశాలను ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాయిదా వేయాలని ఆదేశించింది.ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన అధికారులు ఎవరిని కేబినెట్ సమావేశానికి పిలువొద్దని సూచించింది. అయితే ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల నిర్వహణ, జూన్ నుంచి విద్యా సంస్థలు తెరిచేందుకు ప్రణాళిక వంటి అంశాలకే కేబినెట్ పరిమితం కానుంది.

 

Share post:

లేటెస్ట్