Phone Tapping: రాధాకిషన్​ డైరక్షన్​..ఫామ్​హౌస్​ యాక్షన్​​

మునుగోడు ఉపఎన్నికల సమయంలో హైదరాబాద్‌లో నలుగురు బీ ఆర్‌ఎస్ ఎంఎల్‌ఎల(MLA) కొనుగోలు వ్యవహారం లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఈ కేసుకు మూలం ఫోన్ ట్యాపింగేనని పోలీసు కస్టడీలో ఉన్న మాజీ డిసిపి రాధాకిషన్‌రావు(RadhaKishanRao) చెప్పినట్లుగా తెలుస్తోంది.

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిం దితుడిగా ఉ న్న ఎస్‌ఐబి మాజీ డిఎస్‌పి ప్రణీత్ రావు(DSP Praneeth Rao) నలుగురు బీఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు గువ్వల బాలరాజు, రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డిల ఫో న్లు ట్యాప్ చేశారు. వారు బీజెపితో సంప్రదింపులు జరుపుతున్నట్లు గా తెలియగానే ప్రణీత్ రావు ప్రభు త్వ పెద్దలకు తెలియచేసినట్లుగా తెలుస్తోంది. ఆ త ర్వాత రా ధాకిషన్‌రావుతో కలిసి స్పెషల్ ఆపరేషన్ కు ప్లాన్ చేశారని భావిస్తున్నారు. నందకుమార్‌తో పాటు స్వామిజీని అప్పటి తాండూరు ఎంఎల్‌ఎ పైలట్ రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌కు పిలిపించా రు. అంతకు ముందే ఎంఎల్‌ఎలతో బీఆర్‌ఎస్ పెద్దలతో ఈ అంశంపై మాట్లాడింది.

బేరాల గురించి మొత్తం తెలిసిపోయిందని, రెడ్ హ్యాం డెడ్‌గా పట్టుకునేందుకు సహకరించాలని సూ చించినట్లుగా తెలుస్తోంది. సిట్టింగ్ ఎంఎల్‌ఎలకే టిక్కెట్లు ఆఫర్ చేయడంతో వారు అంగీకరించిటన్లుగా తెలుస్తోం ది. రోహిత్‌రెడ్డికి తెలిసే ఆయన ఫామ్‌హౌస్‌లో ట్రా ప్ కెమెరాలను ఏర్పా టు చేశారు. ట్రాప్ కెమెరాల ను రాధాకిషన్ రా వు అండ్ కో ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. చివరికి అనుకున్నట్లుగా ట్రాప్ చేశా రు. పట్టుకున్నారు. ఈ కేసు సంచలనం అయింది. ఈ కేసులో ఎంఎల్‌ఎలతో బేరాలాడి పట్టుబడిన ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. కేరళకు చెందిన తుషార్‌తో పాటు బీజెపి ముఖ్య నేత బి ఎల్ సంతోష్ పేరు కూడా తెరపైకి వచ్చింది. దీంతో వీరిద్దరిని అరెస్టు చేసేందుకు తెలంగాణ పోలీసులు ప్రయత్నించారు. ఈ కేసు విచారణ కు గత ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.

ఈ కేసు బయటపడిన తర్వాత చాలా రోజుల పాటు ఆ నలుగురు ఎంఎల్‌ఎలు ఫామ్‌హౌస్ లోనే నెల రోజుల పాటు ఉన్నారు. తర్వా త ఈ కేసును సిబిఐకి అప్పగించాలని కోర్టు నిర్ణ యం తీసుకుంది. అయితే సిబిఐకి ఈ కేసును అప్పగించడంపై తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్లింది. స్టే ఆదేశాలు లేకపోయి నప్పటికీ సిబిఐ విచారణ ప్రారంభించలేదు. ఆ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరగాల్సి ఉంది. తర్వాత జరిగిన ఎన్నికల్లో ఈ ఎంఎల్‌ఎలలో ఒక్కరు కూడా విజయం సాధించలేదు.

Related Posts

Assembly Seats: త్వరలో ఏపీ, తెలంగాణలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు!

రాష్ట్రాల అసెంబ్లీ స్థానల పునర్విభజనతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో అసెంబ్లీ స్థానాలు (Telangana Assembly Seats) పెరగవచ్చని తెలుస్తోంది. ఏపీలో 50 (AP Assembly Seats), తెలంగాణ(Telangana)లో 34 కొత్త అసెంబ్లీ స్థానాలు ఏర్పాటు కానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇది…

గన్నవరం చేరుకున్న ప్రధాని.. కాసేపట్లో అమరావతికి మోదీ

అమరావతి పునరుద్ధరణ పనుల(For Amaravati renovation works)కు శ్రీకారం చుట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) గన్నవరం విమానాశ్రయాని( Gannavaram Airport)కి చేరుకున్నారు. ఆయనకు ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మంత్రులు అనిత, అనగాని, వాసంశెట్టి స్వాగతం పలికారు.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *