EX DCP Radha kishan Rao Arrest: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ అరెస్ట్..

ఫొన్​ ట్యాపింగ్​ కేసులో పోలీసులు లుక్​ అవుట్​ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో మాజీ డీసీపీ రాధకిషన్​రావు పోలీసుల విచారణకు హజరయ్యేందుకు అమెరికా నుంచి నేరుగా బంజారాహిల్స్​ పోలీసులు ముందుకు వచ్చారు. అప్పటి ఎస్​ఐబీలో పనిచేసిన సీఐ గట్టుమల్లు పాత్ర కూడా ఉందని తేలడంతో అతనని సైతం ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు.

బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో రాధాకిషన్ రావు, గట్టు మల్లును పోలీసులు ప్రశ్నిస్తున్నారు. గతంలో గట్టు మల్లు ఎస్ఐబీ సీఐగా విధులు నిర్వహించారు. ఆ సమయంలోనే ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు సంబంధాలున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు.

బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో రాధాకిషన్ రావు, గట్టు మల్లును పోలీసులు ప్రశ్నిస్తున్నారు. గతంలో గట్టు మల్లు( CI Gattu Mallu) ఎస్ఐబీ సీఐగా విధులు నిర్వహించారు. ఆ సమయంలోనే ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు సంబంధాలున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు.

బంజారాహిల్స్​ పోలీస్​ స్టేషన్​కు తాళం వేసి విచారణ సాగిస్తున్నారు. వెస్ట్​ జోన్​ డీసీపీ విజయ్​కుమార్​ ఈకేసు పర్యావేక్షణ అధికారిగా ఉన్నారు. రాధకిషన్​రావు, సీఐ గట్టుమల్లును ఎదరుదురుగా ఉంచి ప్రశ్నలు వేస్తున్నట్లు సమాచారం.


రేపు గుడ్​ఫ్రేడే కావడంతో కోర్టుకు సెలవు కావడంతో ఈ రోజు రాత్రికి న్యాయమూర్తి నివాసంలో హజరుపరిచి రిమాండ్​ చేయబోతున్నట్లు తెలుస్తోంది. వీరితోపాటు ఎంపీ సంతోషరావు బావ సందీప్​రావును సైతం పోలీసులు విచారిస్తున్నారు. రూ.270కోట్ల నిధులతో ఇజ్రాయిల్​ నుంచి ఫొన్​ ట్యాపింగ్​ పరికరాలు కోనుగోలు చేసనట్లు ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు.

Share post:

లేటెస్ట్