Sangareddy:పెళ్లి ట్రాక్టర్‌ బోల్తా, ముగ్గురి మృతి

పెళ్లి కూతురి కోసం వెళ్లి ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా చికిత్స పొందుతూ మరొకరి ప్రాణం వదిలిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. 20 మందికి పైగానే గాయాలయ్యాయి. మరో నలుగురి పరిస్థితి సీరియస్​గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనలతో ఆందోల్ మండలం మన్సాన్పల్లి గ్రామ శివారులో విషాదం నెలకుంది.

వ మెదక్ జిల్లా పాపన్నపేట మండలం బాచారం గ్రామానికి చెందిన రమేశ్​కు అందోల్ గ్రామానికి చెందిన మమతతో పెళ్లి నిశ్చయమైంది. ఈనెల 28న వివాహం ఉండడంతో ఈరోజు వధువుని తీసుకొని రావడానికి పాచారం నుంచి పెళ్లి కుమారుడికి సంబంధించిన 29 మంది బంధువులు ఓ ట్రాక్టర్​లో బయలుదేరారు.

Road Accident in Andole Mandal : అందోల్ మండలం మన్సాన్పల్లి గ్రామ శివారులోని మలుపు వద్దకు రాగానే ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో భూదమ్మ (52), సంగమ్మ (46), అక్కడికక్కడే మృతి చెందగా ఆశమ్మ చికిత్స పొందుతూ చనిపోయారు. ఈ ఘటనలో 24 మంది మహిళలకు గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను వెంటనే 108 వాహనాల్లో జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు జోగిపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రేపు పెళ్లి కార్యక్రమం జరగనుండగా బంధువుల రాక, హడావిడితో సందడిగా ఉన్న ఇంటిలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.

Share post:

లేటెస్ట్