BA Raju| ఘనంగా సినీ పాత్రికేయుడు బి.ఎ.రాజు 3వ వ‌ర్ధంతి

Mana Enadu: బి.ఎ.రాజు ఈపేరు చిత్రరంగంలో తెలియనవారు ఉండదరు. సినీ జర్నలిస్టుగా ప్రస్థానం ప్రారంభించి.. పి ఆర్ ఓ గా, పత్రిక..వెబ్సైట్ అధినేతగా,నిర్మాతగా త‌న‌దైన స్థానాన్ని సంపాదించుకున్నారు. సూప‌ర్‌స్టార్ కృష్ణ నుంచి అగ్ర హీరోల‌తో ప‌ని చేసిన అనుభ‌వం ఆయ‌నకే సొంతం. అంద‌రినీ క‌లుపుకునిపోతూ వివాదాల‌కు దూరంగా ఉంటూ అజాత శ‌త్రువ‌గా త‌న‌దైన మార్క్ క్రియేట్ చేశారు బి.ఎ.రాజు.

సూపర్ స్టార్ కృష్ణ వద్ద పబ్లిసిటీ వ్యవహారాలను చూసే పి ఆర్ ఓ గా సినీ కేరీర్ ని ఆరంభించిన బి.ఏ.రాజు ఆ తరువాత ఆయన ప్రోత్సహంతోనే సినీ పాత్రికేయుడిగా రాణించారు. ఆంధ్రజ్యోతి, జ్యోతి చిత్ర, ఉదయం, శివరంజని, వంటి దిన వార పత్రికలలో వివిధ హోదాలలో పనిచేసిన పిమ్మట తన సతీమణి బి జయ సహచర్యంతో 1994 లో సూపర్ హిట్ వార పత్రిక స్థాపించి, తెలుగు సినీ వార్తాపత్రికలలో సంచలనం సృష్టించారు. ఆయన మరణం వరకు ఒక్క సంచిక మిస్సవకుండా 27 సంవత్సరాలపాటు పత్రికను దిగ్విజయంగా నిర్వహించారు. అంతే కాకుండా క్రేజీ వరల్డ్ అనే మరో మ్యాగజైన్‌ను కూడా ద‌శాబ్దకాలం పాటు స‌క్సెస్‌ఫుల్‌గా న‌డిపిన ఘ‌న‌త ఆయ‌న‌కే సొంతం.

కేవలం సినీ జర్నలిస్టుగానే కాకుండా అగ్ర దర్శకులకు, హీరోలకు, హీరోయిన్లకు గైడ్ లైన్స్ ఇస్తూ వారి సినీ కెరీర్ కి మార్గదర్శకుడిగా నిలిచారు. సుమారు 1500 చిత్రాలకు పైగా పబ్లిసిటీ ఇంఛార్జిగా పని చేసిన బి.ఎ.రాజు ఆయా చిత్రాల విజయాలకు దోహదపడ్డారు. చిత్ర పరిశ్రమలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరితో ఆత్మీయ అనుబంధాన్ని ఏర్పర్చుకున్న అజాత శత్రువు బి.ఏ.రాజు. తెలుగు సినీ రంగం హైదరాబాద్ బదిలీ కావడంతో 2001 లో సూపర్ హిట్ అడ్మిస్ట్రేషన్ ఆఫీస్ కూడా హైదరాబాద్ కు షిఫ్ట్ చేసారు. ఈ ఏడాదే అయన నిర్మాతగా, ఆయన భార్య బి జయ దర్శకురాలిగా ‘ప్రేమలో పావని కళ్యాణ్’ అనే చిత్రంతో సూప‌ర్‌హిట్ ఫ్రెండ్స్‌ బ్యానర్ మీద నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు. చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మ గారి మనవడు, సవాల్, ఆర్‌.జె.సినిమాస్ బ్యాన‌ర్‌పై లవ్లీ, వైశాఖం వంటి విజయవంతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. రాజు గారు ప్రారంభించిన ఇండస్ట్రీ హిట్ వెబ్ సైట్ ద్వారా, 6.5 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ కలిగిన ఎంతో పాపులర్ అయిన ఆయన (ట్విట్టర్) ఎక్స్ అకౌంట్ ద్వారా పరిశ్రమకు సంబంధించిన వార్తా విశేషాలు ఎప్పటికప్పుడు ఆయన బృందం, BA Raju’s Team ద్వారా అందిస్తున్నారు.

చిత్ర పరిశ్రమ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. సూపర్ స్టార్ కృష్ణ, సూపర్ స్టార్ మహేష్ బాబు లతో మంచి అనుబంధం ఉంది. ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా పనిచేసారు.24 గంటలు సినిమా గురించే ఆలోచించే బి.ఏ.రాజు మన మధ్యన లేకపోవడం బాధాకరం. మే 21న ఆయ‌న 3వ వ‌ర్ధంతి. ఈ సంద‌ర్భంగా ఏ లోకాన వున్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పించారు.

Related Posts

Bellamkonda Srinivas: హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై కేసు

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై (Bellamkonda Srinivas) కేసు నమోదైంది. రాంగ్ రూట్‌లో కారు నడపడమే కాకుండా ట్రాఫిక్ పోలీస్తో శ్రీనివాస్ దురుసుగా ప్రవర్తించడంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు బుక్ అయ్యింది. ఈనెల 13న జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలోని…

Ram Pothineni: రామ్ కొత్త మూవీ గ్లిమ్స్ వచ్చేసింది.. మూవీ పేరు ఇదే..

రామ్ పోతినేతి (Ram Pothineni), భాగ్య శ్రీ బోర్సే (Bhagyashri Borse) కాంబోలో మహేశ్ బాబు.పి తెరకెక్కిస్తున్న సినిమాకు సంబంధించిన సూపర్ అప్డేట్ వచ్చేసింది. రామ్ పుట్టినరోజు సందర్భంగా మూవీ గ్లిమ్స్ను రిలీజ్ చేశారు. ‘ఆంధ్ర కింగ్ తాలుకా’ (Andhra King…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *