
ప్రేమ (Love).. ఈ రెండక్షరాల ఎమోషన్ ప్రతి మనిషి జీవితంలో ఓ అందమైన మధురానుభూతి. ప్రేమకు ఎన్నో అర్థాలున్నాయి. ప్రేమ అంటే ఏంటి అంటే దానికి సరైన డెఫినేషన్ లేదు. మనుషుల మనసును బట్టి ప్రేమకు అర్థం మారిపోతుంది. కొందరు తమకిష్టమైన వారు లేకపోతే బతకలేకపోవడమే ప్రేమంటే.. మరికొందరేమో.. నా అనుకున్న వారి కోసం ఏదైనా చేయాలి అనిపించడమే ప్రేమ అంటారు. ఇలా ప్రేమకు అర్థం ఒక్కొక్కరి నుంచి మారిపోతూ ఉంటుంది.
ప్రేమంటే ఇదీ.. అని నిర్వచించడం కష్టం. దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సిందే. ప్రేమ ఎప్పుడు ఎలా ఏ సమయంలో ఎవరితో పుడుతుందో చెప్పడం కష్టం. కానీ మధురమైన అనుభూతి గురించి టాలీవుడ్ లో చాలా మంది దర్శకులు తమకు తోచినట్టుగా తమ సినిమాల్లో చూపించారు. చాలా మంది ప్రేమకు సరికొత్త నిర్వచనం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇవాళ ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే (Valentines Day 2025) సందర్భంగా ప్రేమకు తెలుగు సినిమాల్లో దర్శకులు చెప్పిన నిర్వచనాలు ఏంటో ఓసారి చూద్దామా..?
- సంపాదించడం చేతకాని వాడికి ఖర్చు పెట్టే అర్హత లేదు.. చెప్పే ధైర్యం లేని వాడికి ప్రేమించే హక్కులేదు – నువ్వే నువ్వే
- ప్రేమకు చావు లేదంటారు కదా సూర్య.. అలాంటప్పుడు చచ్చేంత ప్రేమ ఎలా పుడుతుంది – ఒక మనసు
- ప్రేమను ప్రేమించిన ప్రేమ.. ప్రేమకై ప్రేమించిన ప్రేమను ప్రేమిస్తుంది – గమ్యం
- పది నెలలు మోసి కన్న మీ అమ్మకు నువ్వు సొంతం అయితే, ఇన్నాళ్లుగా మనసులో మోస్తున్న నాకు కూడా నువ్వు సొంతం. – జాను
- గులాబీని ఇష్టపడితే కోస్తాం.. అదే దాన్ని ప్రేమిస్తే నీళ్లు పోస్తాం – కంచె
- జ్ఞాపకాలు చెడ్డవైనా మంచివైనా ఎప్పుడూ మనతోనే ఉంటాయి మోయక తప్పదు – తొలిప్రేమ
- ప్రేమ పద్మవ్యూహంలాంటిది. మాకందులోకి ఎలా వెళ్లాలో తెలుసు తప్ప.. ఎలా బయటపడాలో తెలియదు – చిత్రలహరి
- బ్రేకప్ చెప్పాలనిపిస్తే అది ప్రేమ కాదు.. నిజమైన ప్రేమ ఎప్పటికీ బ్రేకప్ అవ్వదు – మళ్లీ మళ్లీ ఇది రాని రోజు
- లవ్ ఫెయిల్ అయిన తర్వాత లైఫ్ లేదనుకుంటే.. 25 ఏళ్ల తర్వాత ఎవ్వరూ బతకరు – రాజా రాణి
- ప్రేమంటే పట్టుకోవడం నాన్నా.. వదిలేయటం కాదు – ఉప్పెన