Mana Enadu: ప్రెస్టీజియస్ బ్యానర్ GA2 పిక్చర్స్, బన్నీవాస్, విద్యా కొప్పినీడి, నార్నే నితిన్, అంజి కె.మణిపుత్ర కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఫన్ ఎంటర్‌టైనర్ ‘ఆయ్’ థీమ్ సాంగ్ విడుదల హైదరాబాద్‌లో చేశారు.
ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను అందించిన ప్రతిష్టాత్మక సంస్థ GA2 పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందిన చిత్రం ‘ఆయ్’. ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటించారు. అంజి కె.మణిపుత్ర ఈ చిత్రంతో దర్శకుడిగా బాధ్యతలను నిర్వహించారు. టాలెంటెడ్ యంగ్ ప్రొడ్యూసర్స్ బన్నీ, విద్యా కొప్పినీడి ఈ ఫన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన కంటెంట్ అందరినీ ఆకట్టుకుంటోంది.
వర్షం కోసమే కోటిపైగా ఖర్చు పెట్టామని నిర్మాత అల్లు అర్జున్ అన్నారు. సినిమా చూస్తే మనం నిజంగానే ఆ ఊర్లోకి వెళ్లి వర్షంలో తడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. కథ ఓకే అయిన తరువాత ఎన్టీఆర్ ఫోన్ చేశాం. సినిమా కథ బాగుందని చేసేయండి’ అని ఎన్టీఆర్ అన్నారు.
‘మేం మంచి గోదావరి సినిమాను తీశాం. మంచి ఫ్రెండ్ షిప్ గురించి చెప్పామని హీరో నార్నే నితిన్ తెలిపారు. అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది. మూడు గంటలు నెరేషన్ వింటే.. నవ్వుతూనే ఉన్నాను. ఆడియెన్స్ కూడా అలానే నవ్వుతూనే ఉంటారని ఆశిస్తున్నాని పేర్కొన్నారు.
‘నాకు ఎంటర్టైన్, ఫన్ అంటే చాలా ఇష్టమని ప్రొడ్యూసర్ బన్ని వాసు చెప్పారు. ఎంత కష్టంలో, ఒత్తిడిలో ఉన్నా కూడా ఒక జోక్ మనకు రిలీఫ్ ఇస్తుంది. ఈ సినిమా చూస్తే కచ్చితంగా నవ్వి నవ్వి బుగ్గలు నొప్పి పెడతాయి. ఆ గ్యారెంటీ మేం ఇస్తున్నాం. ఇంకా గట్టిగా నవ్వే వాళ్లుంటే.. పొట్ట కూడా నొప్పి పుడుతుంది.
నితిన్ నార్నే ఎంతో సహజంగా నటించారని డైరక్టర్ అంజి చెప్పుకొచ్చారు. అచ్చం అక్కడి యాసలానే మాట్లాడాడు. అంకిత్, కసిరాజు అద్భుతంగా నటించారు. అమ్మాయిలను నేచర్‌తో పోల్చుతామని అమ్మాయి తడిసినా, ఊరు తడిసినా అందంగా ఉంటుంది. మా ఆయ్ చిత్రం కూడా అంత అందంగా ఉంటుంది’ అని అన్నారు.