Actress Hema : ప్రముఖ తెలుగు సినీయర్ నటి హేమకు భారీ ఊరట లభించింది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఆమెకు బెయిల్ మంజూరు అయింది. ప్రస్తుతం జ్యూడిషియల్ కస్టడీలో భాగంగా పరప్ప అగ్రహార జైలులో ఉన్న హేమకు ఈరోజు బుధవారం (జూన్ 12) బెంగళూరు రూరల్ ఎన్డీపీఎస్ స్పెషల్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
కొద్ది సేపటి క్రితం ఆమె బెయిల్‌పై విడుదల అయినట్టు తెలుస్తోంది. రేవ్ పార్టీ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న హేమ నుంచి ఎలాంటి డ్రగ్స్ కూడా దొరకలేదని, వైద్య పరీక్షలు కూడా నిర్వహించినట్టు ఆమె తరపు న్యాయవాది మహేష్ కిరణ్ శెట్టి కోర్టులో వాదనలు వినిపించారు.
అనంతరం హేమను షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు. కొద్దిరోజుల క్రితమే బెంగళూరు పోలీసులు జీఆర్ ఫామ్‌హౌస్‌పై దాడి చేయగా నటి హేమ పట్టుబడ్డారు. కానీ, అప్పుడే ఆమె ఫామ్‌హౌస్ నుంచి వీడియోను రికార్డు చేసి సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసిన సంగతి తెలిసిందే. తాను బెంగళూరులో లేనని, హైదరాబాద్‌లోనే ఉన్నానని నమ్మించే ప్రయత్నం చేశారు. బెంగళూరు రేవ్ పార్టీలో హేమ కూడా ఉన్నారని పోలీసులు విచారణలో ధృవీకరించారు.