Mana Enadu: హీరో కృష్ణ మనవడు, నటుడు, నిర్మాత రమేశ్‌బాబు తనయుడు జయకృష్ణ హీరోగా అరంగేట్రం చేస్తున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా గురువారం పద్మాలయా సంస్థ కార్యాలయంలో అభిమానుల సమక్షంలో జరిగిన కార్యక్రమంలో జయకృష్ణ కేక్ కట్ చేశారు. దివంగత రమేశ్‌బాబు సతీమణి, జయకృష్ణ తల్లి మృదుల ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘బాబు కోసం కొన్ని కథలు విన్నాం. అందరం కలసి ఓ కథను ఎంపిక చేస్తాం. మంచి బేనర్ ద్వారా చక్కని సినిమాతో జయకృష్ణ త్వరలోనే మీ ముందుకు వస్తాడు’ అని చెప్పారు. అభిమానులందరికీ జయకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.