Hari Hara Veeramallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల్లో హరిహర వీరమల్లు ఒకటి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని AM రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో పవన్ సరసన నిధి అగర్వాల్ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక గత మూడు రోజులుగా ఈ సినిమా డైరెక్టర్ క్రిష్ తప్పుకున్నట్లు వార్తలు వినిపించాయి.
నేడు టీజర్ రిలీజ్ చేస్తూ క్రిష్ తప్పుకున్నట్లు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. వేరే సినిమా ఉండడంతో క్రిష్ వెళ్లిపోయాడని తెలిపారు. అయితే హరి హర వీరమల్లు షూటింగ్ ఇంకొంచెం మిగిలే ఉంది. దీంతో ఆ షూటింగ్ ను ఎవరు ఫినిష్ చేస్తారు అనే అనుమానాలకు కూడా తెరపడింది. మిగతా షూటింగ్ ను AMరత్నం కొడుకు జ్యోతికృష్ణ మిగిలిన షూటింగ్ ను పూర్తిచేయనున్నాడు. సినిమా క్రెడిట్స్ లో క్రిష్, జ్యోతికృష్ణ ఇద్దరి పేరులు యాడ్ చేయనున్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం పవన్ రాజకీయ ప్రచారంలో బిజీగా ఉన్నాడు. ఎలక్షన్స్ అయిన తరువాత కానీ, సెట్ లో అడుగుపెట్టడు. ఇప్పటికే క్రిష్ చాలా ఏళ్లు ఈ సినిమా కోసం వెచ్చించాడు. నిజం చెప్పాలంటే క్రిష్ తప్పుకొని మంచి పనే చేశాడు అని కొందరు అంటున్నారు. అయితే శిల్పం మొత్తాన్ని చెక్కి తుది మెరుగులు దిద్దకుండా అమ్మకానికి పెడితే బాగోదు. అలాగే సినిమాకు ప్రాణం క్లైమాక్స్. పీరియాడికల్ మూవీస్ తీయడంలో క్రిష్ సిద్ధహస్తుడు.
ఇక చివర్లో ఇలా క్రిష్ వెళ్ళిపోతే.. ఒక సినిమాకు దర్శకత్వం వహించిన అనుభవంతో ఇంత పెద్ద బాధ్యతని జ్యోతికృష్ణ సరిగ్గా చేయగలడా ..? అనే అనుమానం అందరికి లేకపోలేదు. మరి హరి హర వీరమల్లు సినిమా రిలీజ్ అయితే తప్ప ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలియవు.