Mana Enadu:ఇక మొదటి సారి చేసిన యాక్షన్ సీన్స్ గురించి మాట్లాడుతూ.. సత్యభామలో యాక్షన్ సీక్వెన్సుల కోసం చాలా కష్టపడ్డా. ఆ ఫైట్స్ అన్నీ చాలా రియలిస్టిక్ గా ఉంటాయి. వర్క్ షాప్స్ కూడా చేశాను. డూప్ లేకుండా స్టంట్స్ చేశాను. సుబ్బు మాస్టర్ యాక్షన్ సీక్వెన్సులు చాలా బాగా కొరియోగ్రాఫి చేశారు అని తెలిపింది.
పెళ్లి తర్వాత యాక్టింగ్ గురించి మాట్లాడుతూ.. పెళ్లయ్యాక హీరోయిన్ కెరీర్ గురించి అందరూ అడుగుతారు. అందరి లాగే హీరోయిన్స్ కు కూడా పర్సనల్ లైఫ్ ఉంటుంది. గతంలో పెళ్లయ్యాక హీరోయిన్స్ కు అవకాశాలు తగ్గుయోమో కానీ ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు. మా ఆయన నాకు వర్క్ విషయంలో చాలా సపోర్ట్ చేస్త్తారు. నా పేరెంట్ లైఫ్ ని, వర్క్ ని బ్యాలెన్స్ చేసుకుంటున్నాను అని తెలిపింది.
–
“సత్యభామ” మూవీ నా పర్సనల్ లైఫ్ తోనూ రిలేట్ చేసుకోవచ్చు. ఈ చిత్రంలో నా క్యారెక్టర్ లా ..నిజ జీవితంలో నేనూ సమాజంలో ఏదైనా జరిగితే స్పందిస్తుంటా. బయటకు వచ్చి ర్యాలీలు చేయకున్నా..ఆ ఘటన గురించి ఆలోచనలు వస్తూనే ఉంటాయి. డిస్ట్రబ్ చేస్తుంటాయి. అందరిలాగే సొసైటీలో జరిగేవాటి గురించి నాకూ కొన్ని వ్యక్తిగతమైన అభిప్రాయాలు ఉంటాయి.
– నన్ను చాలాకాలం టాలీవుడ్ చందమామ అని పిలిచేవారు. ఇప్పుడు సత్యభామ అని పిలిచినా సంతోషిస్తాను. నాకు రెండూ కావాలి. చందమామ బ్యూటిఫుల్ నేమ్, సత్యభామ పవర్ ఫుల్ నేమ్. నాకు రెండూ ఇష్టమే. ఈ కథ చెప్పినప్పుడు ఇన్ స్టంట్ గా ఓకే చెప్పాను. అంతలా నచ్చిందీ స్టోరి.