Laxmi Kataksham: మే 10న ’లక్ష్మీ కటాక్షం’ రిలీజ్​

Mana Enadu:మహతి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నుండి యు. శ్రీనివాసుల రెడ్డి, బి. నాగేశ్వర రెడ్డి, వహీద్ షేక్, కే. పురుషోత్తం రెడ్డి నిర్మించిన ‘లక్ష్మీ కటాక్షం’ డైలాగ్ పోస్టర్ & ట్రైలర్ విడుదల అయ్యి ప్రేక్షకుల నుండి విశేష ఆదరణ పొందిన సంగతి అందరికీ తెలిసిందే. పొలిటికల్ సేటైరికల్ డ్రామా తో వచ్చిన ఈ ‘లక్ష్మీ కటాక్షం’ కాన్సెప్ట్ తనకంటూ ఒక మార్క్ క్రీయేట్ చేసుకుంది. ఓటర్లే వారి ఓటుకు ఒక రేటు ఫిక్స్ చేసుకుని నాయకులని ముప్పు తిప్పలు పెడుతూ డ్రామా తో పాటు, హాస్యం రెండు కలగలిపిన కథ ‘లక్ష్మీ కటాక్షం’.

ఒక పక్క రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల హోరు ఇంకో పక్క ఆ ఎన్నికలకే సెటైరికల్ గా వస్తున్న ‘లక్ష్మీ కటాక్షం’ U/A సర్టిఫికెటును తెచ్చుకొని మే 10న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.

నటీ నటులు: వినయ్,అరుణ్,దీప్తి వర్మ,చరిస్మా శ్రీకర్,హరి ప్రసాద్,సాయి కిరణ్,
ఆమనీ ప్రధాన పాత్రదారులుగా నటిస్తున్నారు.

 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *