MAA||ట్రోల్ చేసే వాళ్ళు టెర్రరిస్టులతో సమానం

Mana Enadu: సోష‌ల్ మీడియాలో న‌టీన‌టుల‌పై వ‌స్తున్న ట్రోల్స్ పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ తెలంగాణ డీజీపీకి మా(మూవీ ఆర్టిస్ట్) అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. శివబాలాజీ, రాజీవ్ కనకాల, సీనియర్ నటుడు శివకృష్ణలు మా అసోసియేషన్ తరపున డీజీపీని కలిశారు. ఐదు యూట్యూబ్ ఛాన‌ల్స్‌ను నిషేధించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే స‌ద‌రు ఐదు యూట్యూబ్ ఛానళ్ళ పై చర్యలు తీసుకోవాలంటూ యూట్యూబ్ ప్రతినిధులకు ఫిర్యాదు చేసిన కాపీని అంద‌జేశారు.

  ట్రోల్ చేసే వాళ్ళు టెర్రరిస్టులతో స‌మాన‌మ‌ని న‌టుడు శివ‌బాల‌జీ అన్నారు.
. లేడీ ఆర్టిస్టుల పై వస్తున్న ట్రోల్ చాలా దారుణంగా ఉన్నాయ‌ని, వీటి వ‌ల్ల‌ కుటుంబాలు చాలా బాధ పడుతున్నాయని చెప్పాడు. క్యారెక్టర్ ను కించ పరిచేలా ట్రోల్ చేస్తున్నారని, పైశాచికత్వం ప్రదర్శిస్తున్నారని చెప్పాడు. ట్రోల్స్ చేసేవి 200పైగా ఛానల్స్ ఉన్నాయి. ఇప్పటికే 25 ఛానల్స్ ఇప్పటికే డౌన్ చేసాము, మీరు కూడా అందులో ఉంటే ఆ లింక్ లు తీసి వెయ్యండన్నారు. ఈ అంశంపై డీజీపీ సానుకూలంగా స్పందించిన‌ట్లు తెలిపారు

200కు పైగా ట్రోల్స్ చేసే ఛానల్స్ ఉన్నాయ‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 25 యూట్యూబ్ ఛాన‌ల్స్‌ టెర్మినేట్ చేసిన‌ట్లు చెప్పారు. దీని కోసం సైబర్ క్రైమ్ టీమ్‌ను పెట్టుకున్న‌ట్లు తెలిపారు. సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌తో కలిసి కో ఆర్డినేషన్ కమిటి ఏర్పాటు చేయబోతున్నామన్నారు.

ట్రోల్స్ న‌వ్వుకునే విధంగా ఉండాలి గానీ ఉడికించేలా ఉండ‌కూడ‌ద‌ని రాజీవ్ క‌న‌కాల అన్నాడు. కుటుంబ స‌భ్యుల మీద కూడా ట్రోల్ చేయ‌డం దారుణ‌మ‌న్నాడు. ఇక మీద‌ట న‌టీన‌టుల మీద ట్రోల్ చేస్తే స‌హించేది లేద‌న్నాడు

 

Related Posts

Gold Price: తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు ఎంతంటే?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. గత కొన్ని రోజులుగా లక్ష రూపాయలకు పైన పలికిన పుత్తడి ధరలు (Gold Price Hike) ప్రస్తుతం కాస్త తగ్గుముఖం పట్టాయి. బంగారం ధరలు తగ్గడానికి అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు ఒక కారణం అయితే, మరో…

Yash Dayal: చిక్కుల్లో ఆర్సీబీ పేసర్‌.. యశ్ దయాల్‌పై లైంగిక ఆరోపణల కేసు

ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టును ఛాంపియన్‌(Champion)గా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించిన జట్టు ఫాస్ట్ బౌలర్ యశ్ దయాల్(Yash Dayal) ప్రస్తుతం పెద్ద సమస్యలో చిక్కుకున్నాడు. UP ఘజియాబాద్‌లోని ఇందిరాపురానికి చెందిన ఓ యువతి, యశ్ దయాల్‌పై లైంగిక…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *