Squid Game Season 2 : మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎక్కడ ఎప్పుడు చూడొచ్చంటే..?

Mana Enadu: పేదరికం కారణంగా ఎలాగైనా డబ్బులు సంపాదించాలని వచ్చిన 456 మందికి ఆ క్రమంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. ఈ డెత్ గేమ్ లో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు? చివరకు ఎంతమంది మిగిలారు?  తోటి వారి ప్రాణాలు కాపాడేందుకు వాళ్లేం చేశారు? చివరకి విజేతగా ఎవరు నిలిచారు? అనే కాన్సెప్ట్ తో వచ్చిన  ‘స్క్విడ్‌ గేమ్‌’ టెలివిజన్‌ సిరీస్‌ కరోనా సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ ప్రేక్షకులను అలరించింది. భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల వాళ్లు ఈ సిరీస్ చూశారు. విడుదలైన 28 రోజుల్లోనే 1.65 బిలియన్‌ అవర్స్‌ స్ట్రీమింగ్‌తో రికార్డును క్రియేట్ చేసింది. ఆరు ఎమ్మీ అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఈ కొరియన్‌ థ్రిల్లర్‌ వెబ్‌సిరీస్‌ రెండో భాగం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో నెట్ ఫ్లిక్స్ గుడ్ న్యూస్ చెప్పింది. 

స్క్విడ్‌ గేమ్‌2 వచ్చేది అప్పుడే.. స్క్విడ్‌ గేమ్‌2 స్ట్రీమింగ్‌ తేదీని నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటించింది. డిసెంబర్‌ 26 నుంచి ప్రసారం కానున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని తెలుపుతూ ఓ వీడియోను షేర్ చేసింది. ఈ సిరీస్‌ ఫైనల్‌ సీజన్‌ వచ్చే ఏడాది (2025) రానున్నట్లు పేర్కొంది. స్టేడియంలో ర‌న్నింగ్ ట్రాక్‌లో కొంత‌మంది ప‌రుగులు తీస్తున్నారు. కొంత‌మంది కింద‌ప‌డిపోగా వారిని షూట్ చేస్తున్న‌ట్లు ఈ వీడియోలో క‌నిపిస్తోంది. రియ‌ల్ గేమ్ బిగిన్స్ అంటూ చివ‌ర‌లో వ‌చ్చిన క్యాప్ష‌న్ గూస్ బంప్స్ తెప్పించింది.

9 థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ తో.. మొత్తం తొమ్మిది ఎపిసోడ్స్‌తో స్క్విడ్ గేమ్ సీజ‌న్-1 రాగా.. సీజ‌న్ 2లో కూడా తొమ్మిది ఎపిసోడ్స్ ఉంటాయ‌ని స‌మాచారం. డిఫ‌రెంట్ గేమ్స్‌తో సెకండ్ సీజ‌న్ సాగ‌బోతున్న‌ట్లు వీడియోలో కనిపిస్తోంది.  స్క్విడ్ గేమ్ సీజ‌న్ 2ను కొరియ‌న్‌, ఇంగ్లీష్‌తో పాటు భార‌తీయ భాష‌ల‌న్నింటిలో రిలీజ్ కానున్న‌ట్లు తెలిసింది.

స్క్విడ్ గేమ్ సీజన్-1 స్టోరీ ఏంటంటే..? అప్పుల‌ు, ఆర్థిక ఇబ్బందులతో బాధ పడుతున్న 456 మంది స్క్విడ్ గేమ్ ఆట‌లో పాల్లొనడానికి వస్తారు. ఈ గేమ్ రూల్స్ చాలా విచిత్రంగా, డేంజరస్ గా ఉంటాయి. ఈ ఆటలో ప్రతి లెవల్ లో ఓడిపోయిన వారిని చంపేస్తుంటారు. సింపుల్ గేమ్స్‌తో మొద‌లైన ఆట‌లో లెవెల్స్ పెరుగుతూ ఉంటే చివ‌ర‌కు ఇద్ద‌రే మిగులుతారు. మరి ఆ ఇద్దరిలో విజేత‌గా ఎవ‌రు నిలిచారు? డ‌బ్బు కోసం గేమ్‌లో పాల్గొన్న వారు ఒక‌రినొక‌రు ఎలా మోసం చేసుకున్నారు.  తోటివారి ప్రాణాలు కాపాడేందుకు జరిగే సంఘర్షణ నేపథ్యంలో వచ్చే ఎమోషనల్ సీన్స్ ఈ సిరీస్ కు ప్రాణం పోశాయి. అవి చూసి కన్నీళ్లు పెట్టని వారంటూ ఉండరు. ఆ పరిస్థితుల్లో ఉంది మనమేనేమో అనిపించేలా మేకర్స్ ఈ సిరీస్ ను తెరకెక్కించారు. 

అయితే ఈ సిరీస్ లో ఊహకు మించిన ట్విస్టులు.. అదిరిపోయే సర్ ప్రైజ్ లు ఉంటారు. ప్రతిక్షణం థ్రిల్ ను పంచుతూ సాగే కథనం ఈ సిరీస్ కు ఆయువుపట్టు. సౌత్ కొరియాలో పేద, ధనికుల మధ్య ఉన్న అంతరాలు.. పెట్టుబడిదారీ వ్యవస్థ ఏ దేశంలోనైనా ఒకేలా ఉంటుందన్నట్లు ఇది చూస్తే అనిపించకమానదు.

 

Share post:

లేటెస్ట్