Super Star||ఘనంగా ఘట్టమనేని జయకృష్ణ జన్మదిన వేడుకలు

Mana Enadu: పద్మాలయ స్టూడియోలో సూపర్ స్టార్ కృష్ణ జ‌న్మ‌దిన వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఆల్ ఇండియా కృష్ణా, మహేష్ ప్రజా సేన జాతీయ అధ్యక్షులు ఖాదర్ గోరి ఆధ్వర్యంలో గురువారం ఘ‌ట్ట‌మ‌నేని జ‌య‌కృష్ణ పుట్టిన‌రోజు వేడుక‌లు జ‌రిగాయి.

సూప‌ర్‌స్టార్ కృష్ణ కుటుంబం నుంచి తెలుగు సినిమా రంగానికి మ‌రో వార‌సుడు హీరోగా పరిచయం కాబోతున్నారు. హీరో మహేష్ బాబు సోద‌రుడు రమేష్ బాబు కుమారుడు జయ కృష్ణ పుట్టినరోజు సంద‌ర్భంగా అభిమానుల సమక్షంలో జయ కృష్ణ పుట్టిన‌రోజు సంబురాలు చేసుకున్నారు. ఖాదర్ గోరి ఏర్పాటు చేసిన కేకును కట్ చేసిన అనంత‌రం జయ కృష్ణకు భారీ గజమాలతో సన్మానం చేశారు ఖాదర్ గోరి మాట్లాడుతూ అభిమానులందరూ మ మీ రాక కొరకు ఎదురుచూస్తున్నామ‌ని తెలిపారు.

జయ కృష్ణ మాట్లాడుతూ త్వరలోనే సినిమా మొదలవుతుంది అన్నారు. అభిమానుల‌తోపాటు అమ్మ మృదుల స‌మ‌క్షంలో పుట్టినరోజు వేడుక‌లు చేసుకోవ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. అలాగే నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన తాతయ్య‌ అభిమానులు నాన్న ర‌మేష్‌, బాబాయ్ మ‌హేష్ బాబు అభిమానులు అందరికీ ధన్యవాదాలు అన్నారు.

ఇప్ప‌టికే కొన్ని కథలు విన్నామ‌ని జ‌య‌కృష్ణ అమ్మ మృదుల వెల్ల‌డించారు. కుటుంబ స‌భ్య‌లు అందరం స్టోరీ విన్న త‌ర్వాత‌నే ఫైన‌ల్ చేస్తామ‌ని పేర్కొన్నారు. త్వ‌ర‌లోనే మంచి బ్యానర్ లో ఒక‌ మంచి సినిమాతోనే ఎంట్రీ కాబోతున్న‌ట్లు వివ‌రించారు. ఈ కార్యక్రమంలో కృష్ణా మహేష్ ప్రజాసేన జాతీయ అధ్యక్షులు ఖాదర్ గోరి
మహేష్ కృష్ణ సేన అధ్యక్షలు మల్లేష్ మరియు శ్రీధర్ నల్గొండ నరసింహ SAC వినోద్ కిరణ్ ఎక్స్ రోడ్ నుండి హరీష్ వసంత్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *