Seethakka : కళావేదిక – ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా మంత్రి సీతక్క..

Mana Enadu: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు గారి పేరుతో సినిమా రంగంలోని విభాగాలలో పలువురు కళాకారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ఎప్పట్నుంచో అవార్డులను అందిస్తుంది. ఈ సంవత్సరం కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక 29 జూన్ 2024న హైదరాబాద్ లోని దసపల్లా హోటల్ లో జరగనుంది. ఇటీవలే కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక పోస్టర్ ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. RV రమణమూర్తి కళావేదిక, రాఘవి మీడియా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరగనుంది.

తాజాగా కళావేదిక టీమ్ తెలంగాణ పంచాయతీరాజ్ & మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క)ను ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఆహ్వానించారు. సీతక్క ఈ కార్యక్రమానికి రావడానికి అంగీకరించారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు ఎన్టీఆర్ అభిమానులు కూడా భారీగా రానున్నారు.

Share post:

లేటెస్ట్