‘జయహో రామానుజ’ సినిమా లిరికల్ సాంగ్స్ లాంఛ్

Mana Enadu: లయన్ డా. సాయి వెంకట్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘జయహో రామానుజ’. ఈ చిత్రాన్ని సుదర్శనం ప్రొడక్షన్స్ లో సాయిప్రసన్న, ప్రవళ్లిక నిర్మిస్తున్నారు. అమెరికా నటి జో శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా..సుమన్, ప్రవళ్లిక ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రెండు భాగాలుగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ జూలై 12న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, సంస్కృత భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇటీవల ‘జయహో రామానుజ’ సినిమా పాటలను తిలకించిన తెలంగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనరసింహా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లయన్ సాయి వెంకట్ కు అభినందనలు అందజేశారు. పాటలు బాగున్నాయంటూ వారు ప్రశంసించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ‘జయహో రామానుజ’ లిరికల్ సాంగ్స్ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా నిర్వహించారు.
నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ – ‘జయహో రామానుజ’ సినిమా చేయాలనేది నా మిత్రుడు లయన్ సాయి వెంకట్ కల. తన కలను నెరవేర్చుకున్న సంతోషంలో ఆయనలో కనిపిస్తోంది. ‘జయహో రామానుజ’ పాటలు చాలా బాగున్నాయి. భక్తితో పాటు సామాజిక చైతన్యాన్ని అందించేలా పాటలను రూపకల్పన చేశారు.

నిర్మాత ప్రసన్న కుమార్ మాట్లాడుతూ – కులమతాలు సమాజంలో విబేధాలు తీసుకురావొద్దనే గొప్ప సందేశాన్ని వెయ్యేళ్ల కిందటే ఇచ్చిన గురువు శ్రీ రామానుజాచార్యులు. ఆయన జీవిత కథతో సినిమా చేయడం లయన్ సాయి వెంకట్ చేసుకున్న అదృష్టం. సినిమాను ఎంతో వ్యయప్రయాసలతో ఆయన రూపొందించాడు.
ఎఫ్ డీసీ మాజీ ఛైర్మన్ అనిల్ కుర్మాచలం మాట్లాడుతూ – ‘జయహో రామానుజ’ చిత్ర పాటల విడుదల కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసిన లయన్ సాయి వెంకట్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

దర్శకుడు, హీరో డా.లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ – ఇటీవల మా ‘జయహో రామానుజ’ సినిమా పాటలను మన ప్రియతమ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనరసింహా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి చూపించడం జరిగింది. వారు పాటలన్నీ తమకు బాగా నచ్చాయంటూ ప్రశంసిస్తూ ఆశీస్సులు అందజేశారు.సంగీత సాహిత్యాలు గొప్పగా ఉండాలని ఎంతో టైమ్ తీసుకుని ఖర్చుకు వెనకాడకుండా సాంగ్స్ డిజైన్ చేశాం. మీ అందరికీ మా మూవీ సాంగ్స్ నచ్చాయని ఆశిస్తున్నాం.

నిర్మాత ప్రవళ్లిక మాట్లాడుతూ – ‘జయహో రామానుజ’ సినిమా పాటలన్నీ మీకు నచ్చాయని నమ్ముతున్నాం. నాన్న సినిమా కోసం ఎంత శ్రమించారో ఈ పాటలు అందంగా తీసుకొచ్చేందుకు అంతే జాగ్రత్తలు తీసుకున్నారు. ‘జయహో రామానుజ’ సినిమా నాన్నగారికి ఒక కల. ఈ సినిమా చిత్రీకరణలో పిల్లలుగా మమ్మల్ని కూడా భాగస్వాములను చేశారు. భారీ స్థాయిలో అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమాను నిర్మించామని తెలిపారు.

Related Posts

Naga Chaitanya: స్టైలిష్ లుక్‌లో చైతూ.. ‘NC24’ షూటింగ్ షురూ

‘తండేల్’ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు హీరో అక్కినేని నాగ చైతన్య(Akkineni Naga Chaitanya), డైరెక్టర్ చందూ మొండేటి(Chandu Mondeti) తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్(Box Office) వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *