Financial frauds:ఆర్థిక మోసం కేసులో పద్మశ్రీ అవార్డు గ్రహీత అరెస్టు!

Mana Enadu:దేశంలో రోజురోజుకీ స్కామ్‌లు, మోసాలు పెరిగిపోతున్నాయి. ఎవరు ఎప్పుడు ఎవరిని మోసం చేస్తారని తెలియని పరిస్థితి తలెత్తింది. ముఖ్యంగా ఆర్థిక మోసాలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. ఇందులో పేద, మధ్యతరగతి వారి కంటే సంపన్నులే ఈ తరహా మోసాలు చేసి పట్టుబడుతున్నారు. మరికొందరు ఎంచక్కా దోచుకొని విదేశాలకు చెక్కుస్తున్నారు. తాజాగా ఆర్థిక మోసం(Financial frauds)కేసులో కేరళకు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత సుందర్ సీ మేనన్‌(Sundar c menon)ను పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 18 సెక్షన్ల కింద పోలీసులు ఆయనపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ న్యూస్ దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

వారికి ఇవేం కొత్తకాదు..

సాధారణంగా కొందరు బిజినెస్‌మెన్లు (businessmen)ఆర్థిక నేరాల కేసుల్లో అరెస్టు అవ్వడం, ఆ తర్వాత బెయిల్‌పై విడుదలవడం వారికి పెద్ద విషయమేమీ కాదు. కానీ కేరళకు చెందిన ఈ వ్యాపారవేత్త ఆర్ధిక మోసం కేసులో ఆరోపణలు ఎదుర్కోవడం, కోర్డు(court)రిమాండ్ విధించడం హాట్ టాపిక్ అయ్యింది. అదీ ఎందుకు అంటే.. అరెస్టు అయిన వ్యాపారవేత్త పద్మశ్రీ అవార్డు గ్రహీత కావడం. 2016లో పద్మశ్రీ అవార్డు అందుకున్న వ్యాపార వేత్త సుందర్ సీ మేనన్ పలు సంస్థలకు డైరెక్టర్‌గా వ్యహరిస్తున్నారు కూడా.

అయితే సుందర్ సీ మీనన్(Sundar c menon), మరి కొందరు తమ సంస్థల పేరుపై 62 మందికిపైగా ఇన్వెస్టర్‌(investers)ల నుంచి రూ.7.78 కోట్ల డిపాజిట్లు(deposites) తీసుకుని, స్కీమ్ మెచ్యూరిటీ వ్యవధి తర్వాత డబ్బులు చెల్లించకుండా మోసం చేశారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై వివిధ సెక్షన్‌ల కింద 18 కేసులు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు.

గత ఐదేళ్లలో జరిగిన ఆర్థిక మోసాల ఇలా..

మరోవైపు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి(pankaj choudary)ఇటీవల గత ఐదేళ్లలో జరిగిన ఆర్థిక మోసాల కేసుల పెరుగుదలను ఎత్తిచూపారు. ఆయా రిపోర్టుల ప్రకారం ఈ తరహా మోసం కేసుల సంఖ్య 2019-20 ఆర్థిక సంవత్సరంలో 2,677 నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు 29,082కి పెరిగింది. ఇది 986% పెరుగుదల. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ₹129 కోట్ల నుంచి ₹1,457 కోట్లకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో 1,068% హైక్ అయింది. ఈ మోసాలలో దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఆయన ఆందోళరన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్రం, అధికారులు ఇలాంటి మోసాలపై కఠినంగా ఉండకపోతే మున్ముందు మరిన్ని ఘటనలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.

Share post:

లేటెస్ట్